జేబుల్లో ఏమీ లేవంటే వినరేంటీ?
IND vs AUS: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరుగుతోన్న అయిదో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓటమి అంచుల్లో నిలిచింది. టీ బ్రేక్ సమయానికల్లా మ్యాచ్ ముగిసిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రారంభంలో వెంటవెంటనే వికెట్లు పడ్డప్పటికీ- ఆ తరువాత బౌలర్లు చేతులెత్తేశారు. ఒత్తిడికి లోనయ్యారు. బ్యాటర్లను కట్టడి చేయడంలో విఫలం అయ్యారు.
గెలవడానికి 162 పరుగులు చేయాల్సిన దశలో వెంటవెంటనే నాలుగు వికెట్లను కూల్చారు బౌలర్లు. ఆస్ట్రేలియా బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టగలిగారు. ఆ తరువాత పట్టు సడలింది. మిడిలార్డర్ బ్యాటర్ ట్రావిస్ హెడ్, కొత్త ప్లేయర్ బ్యు వెబ్‌స్టర్ క్రీజ్‌లో పాతుకుపోయారు. మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడారు.

దీనితో రెండో ఇన్నింగ్ తొలి సెషన్ ప్రారంభంలో ఉన్న ధీమా ఆ తరువాత సన్నగిల్లుతూ వచ్చింది. మూడు వికెట్లు పడగొట్టిన ప్రసిద్ధ్ కృష్ణ ఆ తరువాత చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపించలేకపోయాడు. ఒత్తిడికి లోనయ్యాడు. మరో ఎండ్‌లో అతనికి సహకరించే బౌలర్లు లేకపోవడం మైనస్ పాయింట్ అయింది.
ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్, మార్నుస్ లాబుషేన్, స్టీవెన్ స్మిత్ వికెట్లు ప్రసిద్ధ్ కృష్ణ ఖాతాలోనే పడ్డాయి. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను మహ్మద్ సిరాజ్ అవుట్ చేశాడు. ఆ తరువాత వికెట్ల పతనానికి బ్రేక్ పడింది. క్రీజ్‌లో ఉన్న ట్రావిస్ హెడ్, వెబ్‌స్టర్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. జట్టును విజయ తీరాలకు చేర్చారు.
స్టీవెన్ స్మిత్ అవుట్ అయ్యాక గ్రౌండ్‌లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. విరాట్ కోహ్లీ శాండ్ పేపర్ గేట్‌ను ఎదుర్కొన్నాడు. శాండ్ పేపర్ అంటూ స్టేడియంలో ఉన్న వాళ్లు గట్టిగా కేకలు వేశారు. తాత్కాలిక కేప్టెన్ విరాట్ కోహ్లీ శాండ్ పేపర్‌తో బంతి రూపురేఖలను మార్చాడనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
VIRAT KOHLI REPLICATING THE SANDPAPER GATE INCIDENT. 🤣🔥pic.twitter.com/qRxgmBaqAh
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 5, 2025
దీనితో కోహ్లీ తన ప్యాంట్ జేబులు ఖాళీగా ఉన్నాయని పదే పదే చూపించాల్సొచ్చింది. ఆ సమయంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అతని పక్కనే ఉన్నాడు. పంత్‌తో మాట్లాడుతూనే రెండు జేబుల్లో చేతులు పెట్టి, వాటిని బయటికి లాగి.. ఏమీ లేదంటూ చేతులు అడ్డంగా ఊపాడు.
దీనికి కారణం లేకపోలేదు. 2018లో శాండ్ పేపర్ గేట్ ఆరోపణలకు గురైంది ఆస్ట్రేలియా. దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ స్టేడియంలో ఆ దేశ జట్టుతో ఆడిన టెస్ట్ మ్యాచ్‌లో శాండ్ పేపర్‌ను వినియోగించిందని, బాల్‌ను ట్యాంపరింగ్ చేసిందటూ విమర్శలను ఎదుర్కొంది. అదే ఇప్పుడు ప్రస్తావనకు తెచ్చారు సిడ్నీ ఆడియన్స్.












Click it and Unblock the Notifications