నితీష్‌పై ఫోకస్- హోమ్ పిచ్‌పై టీ20

IND vs BAN 3rd T20: బంగ్లాదేశ్‌తో చివరి టీ20 ఇంటర్నేషనల్‌లో తలపడబోతోంది భారత జట్టు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం దీనికి వేదిక. ఈ సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ మొదలు కాబోతోంది. ఇందులో గెలిస్తే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసినట్టవుతుంది. ఇప్పటికే 2-0 తేడాతో ఆధిక్యతలో ఉంది టీమిండియా.

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచుల్లోనూ విజయకేతనాన్ని ఎగురవేసింది. ఈ సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకుంది. ఈ రెండింట్లోనూ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది బంగ్లాదేశ్. ఇప్పుడు టీ20ల్లోనూ అదే పరిస్థితి. ఇప్పటివరకు ఆడిన రెండింట్లోనూ టీమిండియా ఎదురు లేకుండా పోయింది.

IND vs BAN 3rd T20I Ravi Bishnoi and Harshit Rana likely to get chance in India Playing 11

దాదాపుగా ఐపీఎల్ స్టార్ ప్లేయర్లు, టీ20 స్పెషలిస్టులతో నిండిన యంగ్ టీమ్ ఇది. టాప్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. జట్టుకు సారథ్యాన్ని వహిస్తోన్న విషయం తెలిసిందే. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, సంజు శాంసన్ మినహా అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం పెద్దగా లేని ప్లేయర్లే జట్టులో ఉన్నారు.

అయినప్పటికీ- యువ క్రికెటర్లు సత్తా చాటుతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో మెరుపులా కదులుతున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్ రౌండర్, తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండర్‌ ప్రతిభను కనపర్చాడీ సిరీస్‌లో. తొలి రెండు మ్యాచ్‌లల్లోనూ తానేంటో నిరూపించుకున్నాడు.

రెండో మ్యాచ్‌లో 34 బంతుల్లోనే 74 పరుగులు చేశాడు నితీష్ కుమార్ రెడ్డి. ఏడు భారీ సిక్సర్లు, నాలుగు ఫోర్లతో ఆటతీరును మార్చివేశాడు. అతని సునామీ ఇన్నింగ్ వల్ల 222 పరుగుల భారీ స్కోచ్ చేయగలిగింది టీమిండియా. ఫలితంగా అతను బీసీసీఐ సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు.

న్యూజిలాండ్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌కూ ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. ఈ సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ చివరి టీ20లోనూ చెలరేగడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకరకంగా ఇది అతనికి హోమ్ పిచ్. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్‌లో మ్యాచ్‌లల్లో దుమ్ము దులిపాడు. తొలిసారిగా తన సొంత గడ్డపై ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడబోతోన్నాడు.

ఈ మ్యాచ్ ఆడనున్న టీమిండియా తుదిజట్టులో రవి బిష్ణోయ్, హర్షిత్ రాణాకు చోటు దక్కే అవకాశం ఉంది. సిరీస్‌ను ఇప్పటికే సొంతం చేసుకున్నందున వారిద్దరినీ ఆడించవచ్చు. ఇప్పటివరకూ వీరిద్దరూ బెంచ్‌కే పరిమితం అయ్యారు.

తుదిజట్టులో- సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కేప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి/రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్/హర్షిత్ రాణాకు చోటు దక్కొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+