టెస్టులపై విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం

Virat Kohli: భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటోంది. ఈ నెల 25వ తేదీ నుంచి ఆరంభం కాబోయే టెస్ట్ సిరీస్ కోసం సన్నద్ధమౌతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ సిరీస్ జరుగనుంది. అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను ఢీ కొట్టబోతోంది భారత్.

తొలి మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోంది హైదరాబాద్‌. ఈ నెల 25వ తేదీన ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఫిబ్రవరి 2న విశాఖపట్నంలో రెండో టెస్ట్ మ్యాచ్ షెడ్యూల్ అయింది. మూడో మ్యాచ్ ఈ నెల 15వ తేదీన రాజ్‌కోట్‌లో, నాలుగో మ్యాచ్ 23న రాంచీలో ముగుస్తాయి. మార్చి 7వ తేదీన హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో అయిదో మ్యాచ్ జరుగుతుంది.

IND vs ENG 1st Test: Virat Kohli will miss the first 2 Test matches against England

ఈ సిరీస్‌కు రోహిత్ శర్మ కేప్టెన్సీని వహిస్తోన్నాడు. దీని తరువాత ఐపీఎల్‌ 2024 సిరీస్‌ మొదలవుతుంది. మార్చి 23వ తేదీ నుంచి ఐపీఎల్ ఉంటుంది. టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే ఐపీఎల్ జాతర ఆరంభమౌతుంది. స్వదేశంలో జరగబోయే టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించడానికి భారత జట్టు రంగం సిద్ధం చేసుకుంది.

ఈ పరిస్థితుల మధ్య టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండట్లేదని ప్రకటించాడు. హైదరాబాద్, విశాఖపట్నంలల్లో తొలి రెండు టెస్టుల నుంచి తన పేరును ఉపసంహరించుకుంటోన్నట్లు వెల్లడించాడు. తుది జట్టు కోసం తన పేరును పరిశీలించొద్దని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు.

దీనికి గల కారణాలను వెల్లడించలేదు విరాట్ కోహ్లీ. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్‌తో జరిగే తొలి రెండు టెస్టుల నుంచి తప్పుకొంటోన్నట్లు వివరించాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌ తొలి మ్యాచ్‌కూ డుమ్మా కొట్టాడీ బ్యాటింగ్ మెషీన్. ఇప్పుడు మళ్లీ అదే దారి పట్టాడు. బలమైన ఇంగ్లాండ్‌తో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న టెస్ట్ సిరీస్ తొలి రెండు మ్యాచ్‌ల నుంచి వైదొలిగాడు.

విరాట్ కోహ్లీ అందుబాటులో లేకపోవడం వల్ల జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేర్పులు జరగొచ్చు. మిడిలార్డర్ బ్యాటర్లు శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్‌కు బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోట్ చేసే అవకాశాలు ఉన్నాయి. వారిలో ఒకరిని ముందుకు జరిపి టాప్ ఆర్డర్‌‌లో బరిలోకి దింపడం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+