ఆ బండోడికి చెప్పు..: పచ్చి బూతులు బాబోయ్..!!

Gautam Gambhir: అండర్సన్- టెండుల్కర్ టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత్.. తన చివరిదైన అయిదో మ్యాచ్ కోసం ప్రిపేర్ అవుతోంది. ఈ నెల 31వ తేదీన లండన్ కెన్నింగ్టన్ ఓవల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ మొదలవుతుంది. ఇందులో ఓడిపోతే సిరీస్ ను ఇంగ్లాండ్ కు ధారదాత్తం చేసినట్టవుతుంది టీమిండియాకు.

ఇప్పటివరకు జరిగిన నాలుగింట్లో ఇంగ్లాండ్ రెండింట్లో విజయం సాధించింది. 2-1 తేడాతో ఆధిక్యతను సాధించింది. మాంచెస్టర్ లో జరిగిన నాలుగో టెస్ట్ నాటకీయ పరిణామాల మధ్య డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. సిరీస్ ను సొంతం చేసుకోవడానికి ఇంగ్లాండ్, సమం చేయడానికి టీమిండియా శాయశక్తులా ప్రయత్నిస్తోన్నాయి. నెట్ ప్రాక్టీస్ లో నిమగ్నం అయ్యాయి.

IND vs ENG 5th test Gambhir having a heated conversation with the Oval Pitch Curator

ఈ పరిణామాల మధ్య ఓవల్ స్టేడియంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. ఓవల్ పిచ్ క్యురేటర్ లీ ఫోర్టిస్ తో గొడవ పడ్డాడు. ఓవల్ స్టేడియంలో జట్టుకు కల్పించాల్సిన సౌకర్యాలు, పిచ్ రూపకల్పనపై అతను తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. నేరుగా క్యురేటర్ తోనే గొడవకు దిగాడు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒకదశలో ఆరడుగుల కంటే ఎత్తు, బలిష్టంగా కనిపించిన లీ ఫోర్టిస్ మీది మీదికి వెళ్లాడు. అతని ఎదురుగా నిల్చుని వేలెత్తి చూపిస్తూ మాట్లాడటం కనిపించింది. ఆ సమయంలో గంభీర్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు.

"ఏం చేయాలో మాకు తెలుసు. నువ్వు చెప్పనక్కర్లేదు.." అంటూ గంభీర్ అతనిపై మండిపడ్డాడు. 'Go F*** Off, You Are Only A...' అంటూ ఘాటు పదజాలంతో విరుచుకుపడ్డాడు. నువ్వు గ్రౌండ్స్ మెన్ మాత్రమే.. అని గంభీర్ గట్టిగా అరిచాడు. టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నె మోర్కెల్, బ్యాటింగ్ కోచ్ శీతాన్షు కోటక్.. వారిద్దరి మధ్య వాగ్వివాదాన్ని చూస్తూ నిల్చున్నారే తప్ప విడిపించే ప్రయత్నం కూడా చేయలేదు.

ఈ హీటెడ్ ఎక్స్ఛేంజ్ అలాగే కొనసాగుతుండటంతో శీతాన్షు కోటక్.. పిచ్ క్యురేటర్ కు సర్దిచెప్పడం ఈ వీడియోలో స్పష్టంగా రికార్డయింది. ఆ సమయంలో- నెట్స్ నుంచి కూడా గౌతమ్ గంభీర్.. లీ ఫోర్టిస్ వైపు వేలెత్తి చూపుతూ గట్టిగా మాట్లాడటం వినిపించింది. గంభీర్ తీవ్ర అసహనానికి కారణం ఓవల్‌లో కల్పించిన సౌకర్యాలే కారణమని చెబుతున్నారు.

ఈ సంఘటన తర్వాత గంభీర్ నెట్ సెషన్‌ను పర్యవేక్షించడానికి తిరిగి వెళ్లాడు. అనంతరం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్‌తో చర్చలు జరిపాడు. ఫోర్టిస్, సర్రే, ఈసీబీ ప్రతినిధులతో మాట్లాడాడు. తన అసహనానికి గల కారణాలను వివరించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+