ఫిన్ అలెన్ vs బూమ్రా, ఎవరిని సైలెంట్ చేస్తే వారే ఛాంపియన్- గంభీర్ బిగ్ ప్లాన్..!!
T20 World Cup Final India Vs New Zealand: టీ20 ప్రపంచ కప్ తుది సమరానికి సర్వం సిద్దమైంది. భారత్ - కివీస్ జట్ల మధ్య అహ్మదాబాద్ లో జరిగే గ్రాండ్ ఫైనల్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. అటు ఇరు జట్లు తమ లక్కును పరీక్షించుకునేందుకు కొత్త ప్లాన్స్ తో బరిలోకి దిగుతున్నారు. ఈ పోరులో కివీస్ సెన్సేషన్ ఫిన్ అలెన్ వర్సస్ బూమ్రా పైట్ పైనే ఫైనల్ ఫలితం ఆధారపడి ఉంది. దీంతో.. ఫిన్ అలెన్ కోసం గౌతం గంభీర్ బిగ్ ప్లాన్ తో సిద్దం అయ్యాడు. మరి.. ఈ వ్యూహాలు ఫలిస్తాయా.. ఎవరిని ఎవరు సైలెంట్ చేస్తారు..
టీ20 ప్రపంచ కప్ లో కివీస్ - భారత్ జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ వేళ ఆసక్తి కర అంశాలు చర్చ గా మారాయి. ఇక్కడ టాస్ కీలకం కానుంది. పిచ్ కండీషన్లు బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండటంతో.. భారీ స్కోర్లు ఖాయంగా కనిపిస్తున్నాయి. దీంతో.. భారత్ జట్టు అభిషేక్, సంజూ, ఇషాన్ కిషన్, సూర్య కుమార్, హర్దిక్, శివం దుబే పైన ఆశలు పెట్టుకుంది. అభిషేక్ ఫాంలోకి వస్తే కివీస్ కు చుక్కలు ఖాయం. అదే విధంగా కివీస్ నుంచి బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. అందులో తాజాగా సఫారీలకు చుక్కలు చూపించిన విధ్వంసకర బ్యాటర్ ఫిన్ అలెన్ పైనే ఇప్పుడు కోచ్ తో సహా భారత్ టీం ఫోకస్ చేసింది. ఫిన్ అలెన్ నియంత్రించే బాధ్యత బూమ్రాకు అప్పగించింది. పవర్ ప్లే లో ఫిన్ అలెన్ ను బూమ్రా నియంత్రిస్తే ఇక.. సగం మ్యాచ్ అక్కడే పూర్తయినట్లుగా భావిస్తున్నారు. అర్షదీప్, వరుణ్ చక్రవర్తి, అక్షర్, హర్దిక్ సైతం బౌలింగ్ లో రాణించాల్సి ఉంటుంది.

పవర్ ప్లే లోనే మ్యాచ్ ఫలితం ఫిక్స్
ఈ మెగా ఫైనల్‌లో అందరి దృష్టి ఇద్దరు విధ్వంసకర ఓపెనర్లపైనే ఉంది. వారే భారత స్టార్ సంజూ శాంసన్, కివీస్ సెన్సేషన్ ఫిన్ అలెన్. సెమీఫైనల్‌లో వీరిద్దరూ ఆడిన ఇన్నింగ్స్‌లు చూస్తుంటే, ఫైనల్‌లో బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. పవర్ ప్లేలోనే ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బ తీయడంలో వీరిద్దరూ ఇప్పటి వరకు పై చేయి సాధించారు. కాగా, కివీస్ ఇప్పుడు అభిషేక్ తో పాటుగా సంజూ ను త్వరగా డకౌట్ కు పంపటం లక్ష్యంగా ఫిక్స్ చేసుకుంది. ఫిన్ అలెన్ సెమీఫైనల్‌లో విధ్వంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకుని, టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. ఫైనల్ ఆడుతున్న పిచ్ పూర్తిగా బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది. ఇలాంటి చోట సంజూ శాంసన్ క్లాస్ అండ్ మాస్ బ్యాటింగ్, ఫిన్ అలెన్ పవర్ హిట్టింగ్ మధ్య జరిగే యుద్ధం అభిమానులకు పూర్తిగా పైసా వసూల్ గా మారనుంది. దీంతో.. ఈ వార్ లో ఎవరిది పై చేయి అవుతుందో అనేది ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications