ఇదీ పోయినట్టే..!!
IND vs NZ: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓటమి దిశగా సాగుతోంది. మ్యాచ్‌పై బిగించిన పట్టు సడలింది. బౌలింగ్‌లో చెలరేగినప్పటికీ.. బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమౌతోంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 359 పరుగులను ఛేజ్ చేయడంలో చేతులెత్తేసినట్టే. 178 పరుగులకు ఏడు వికెట్లను కోల్పోయింది టీమిండియా.
మూడో రోజు తొలి సెషన్‌లో న్యూజిలాండ్ 255 పరుగులకు ఆలౌట్ అయింది. మొత్తంగా భారత్ ముందు పోరాడదగ్గ స్కోర్‌ను ఉంచింది. 359 పరుగులను నిర్దేశించింది. ఈ టెస్ట్ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను సమం చేయాలంటే భారత్‌కు 359 పరుగులు అవసరం. ఈ స్కోర్‌ను ఛేదించడానికి బరిలో దిగిన భారత బ్యాటర్లు తడబడ్డారు.

ఎక్కడే గానీ కుదురుకోలేదు. వికెట్ల పతనానికి బ్రేకులూ పడలేదు. ఓపెనర్ కేప్టెన్ రోహిత్ శర్మ వికెట్‌తో భారత బ్యాటింగ్ ఆర్డర్ పతనం ఆరంభమైంది. ఎనిమిది పరుగులు చేసి శాంట్నర్ బౌలింగ్‌లో విల్ యంగ్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ. ఆ తరువాత వచ్చిన బ్యాటర్లెవరూ కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిల్చోలేకపోయారు.
శుభ్‌మన్ గిల్- 23, యశస్వి జైస్వాల్- 77, విరాట్ కోహ్లీ- 17, రిషభ్ పంత్- 0, వాషింగ్టన్ సుందర్- 21, తొలి టెస్ట్ మ్యాచ్ సెంచరీ హీరో సర్ఫరాజ్ ఖాన్- 9 పరుగులు చేసి వెనుదిరిగారు. టీ బ్రేక్ సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది భారత్. క్రీజ్‌లో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో గెలవాలంటే ఇంకా 181 పరుగులు చేయాల్సి ఉంది భారత్‌కు. చేతిలో ఉన్నది మూడు వికెట్లే. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప గెలవడం అసాధ్యం అనిపించేలా ఉందక్కడి పరిస్థితి. పుణె పిచ్ పూర్తిగా స్పిన్‌కు అనుకూలంగా మారిన నేపథ్యంలో మిఛెల్ శాంట్నర్ చెలరేగుతున్నాడు. తొలి ఇన్నింగ్ తరహాలోనే ఇప్పుడు కూడా అయిదు వికెట్లు కూల్చాడు.
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్ వికెట్లు శాంట్నర్ ఖాతాలో పడ్డాయి. రిషభ్ పంత్ రనౌట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్ అవుట్ అయిన తీరు శాంట్నర్ బౌలింగ్ నైపుణ్యానికి అద్దం పట్టినట్టయింది. ఇంకా రెండు రోజుల గేమ్ మిగిలివుండగానే మ్యాచ్ ముగిసేలా కనిపిస్తోంది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications