పాకిస్తాన్ అమ్మాయిలు కూడానా..? టాస్‌లో టీమిండియాను మోసం చేసిన పాక్ కెప్టెన్

భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే హై-టెన్షన్, కానీ కొలంబో వేదికగా జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌ మ్యాచ్ మాత్రం క్రికెట్ మైదానంలో నిజాయితీ అనే ప్రశ్నకు తావిచ్చింది. కేవలం కరచాలనం చేసుకోకపోవడం వరకు అయితే ఇది ఇరు దేశాల మధ్య మైదానంలోని పంతం అనుకోవచ్చు. కానీ, టాస్ విషయంలో పాకిస్తాన్ కెప్టెన్ మౌనం వహించడం ద్వారా టీమ్ ఇండియాకు జరిగిన అన్యాయం ఇప్పుడు అతి పెద్ద వివాదంగా మారింది.

ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో అందరి దృష్టి టాస్ పైనే నిలిచింది. పురుషుల ఆసియా కప్‌లో జరిగినట్లుగానే, ఈసారి కూడా భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ , పాక్ కెప్టెన్ ఫాతిమా సనా కరచాలనం చేసుకోలేదు. చూపులు మార్చుకోలేదు, పలకరించుకోలేదు. అంతవరకు బాగానే ఉంది.

Ind vs Pak Women s World Cup Pakistan Captain Fatima Sana s Silent Cheating in Toss

పాక్ కెప్టెన్ ఫాతిమా సనా టాస్ వేసిన వెంటనే టెయిల్స్ అని గట్టిగా పిలిచింది.కాయిన్ పడిన తర్వాత ఫలితం హెడ్స్ అని వచ్చింది. అయితే, అక్కడ ఉన్న మ్యాచ్ రిఫరీ శాండ్రే ఫ్రిట్జ్, సనా పిలిచింది హెడ్స్ అని పొరపాటున ప్రకటించేశారు. దీంతో, నాణెం హెడ్స్‌గా రావడంతో రిఫరీ పొరపాటుగా పాకిస్తాన్‌ను టాస్ విజేతగా ప్రకటించారు.

రిఫరీ పొరపాటున పాక్‌ను విజేతగా ప్రకటించిన వెంటనే, నిజానికి ఫాతిమా సనా నిజాయితీగా స్పందించాలి. తాను టెయిల్స్ అని పిలిచానని ఒప్పుకుంటే, ఆమె టాస్ ఓడిపోయేది.

కానీ, సనా ఫాతిమా ఆ సమయంలో మౌనం వహించడం అత్యంత ఆశ్చర్యకరం. తాను టెయిల్స్‌కు కాల్ చేసి, టాస్ కోల్పోయానని తెలిసినప్పటికీ, ఆమె ఒక్క మాట కూడా మాట్లాడకుండా, ఆ తప్పును కప్పిపుచ్చి, రిఫరీ ప్రకటించిన ప్రకారం టాస్ గెలిచినట్లు ముందుకు వెళ్లింది. నిశ్శబ్దంగానే ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది.

ఒక క్రీడాకారిణిగా, కెప్టెన్‌గా క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిన ఫాతిమా సనా వైఖరిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం టాస్ గెలవడం కోసం నిజాయితీని పణంగా పెట్టి, టీమ్ ఇండియాకు అన్యాయం చేసిన ఈ ఘటన... క్రీడా మైదానంలో భారత్-పాకిస్తాన్ మధ్య ఉన్న శత్రుత్వం ఏ స్థాయికి చేరిందో నిరూపిస్తోంది. క్రికెట్ చరిత్రలోనే ఇది బిగ్గెస్ట్ 'సైలెంట్ చీటింగ్' డ్రామా అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+