జింబాబ్వేపై తోక ముడిచిన ఐపీఎల్ పులులు: వారిద్దరూ అవుట్?
IND vs ZIM: అయిదు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్స్ సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయాన్ని చవి చూసింది. 13 పరుగుల తేడాతో మట్టికరిచింది. ఈ విజయంతో ఈ సిరీస్‌లో జింబాబే 0-1 తేడాతో ఆధిక్యత సాధించింది. రెండో మ్యాచ్ ఈ సాయంత్రం 4:30 గంటలకు హరారెలో జరుగనుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. టీమిండియా బౌలర్ల ధాటికి నిలువలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 115 పరుగులే చేయగలిగింది. ఓపెనర్ వెస్లీ మధెవెర- 21, బ్రియాన్ బెన్నెట్- 22, కేప్టెన్ సికందర్ రజా- 17, డియాన్ మేయర్స్- 23, క్లైవ్ మదండే- 29 పరుగులు చేశారు.

టీమిండియా బౌలర్లల్లో రవి బిష్ణోయ్ సత్తా చాటాడు. నాలుగు ఓవర్ల కోటాలో 13 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. టీ20 ఇంటర్నేషనల్స్‌లో అతను బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్‌ను సాధించాడు. వాషింగ్టన్ సుందర్- 2, ముఖేష్ కుమార్- 1, అవేష్ ఖాన్- 1 వికెట్ పడగొట్టారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 102 పరుగులకే ఆలౌట్ అయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్, ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్- 7, రియాన్ పరాగ్- 2, రింకూసింగ్- 0, ధృవ్ జురెల్- 6, రవి బిష్ణోయ్- 9, ముఖేష్ కుమార్- 0, ఖలీల్ అహ్మద్- 0 (నాటౌట్) ఇలా ఏ ఒక్కరు కూడా క్రీజ్‌లో నిలదొక్కుకోలేకపోయారు. కేప్టెన్ శుభ్‌మన్ గిల్- 31, వాషింగ్టన్ సుందర్- 27, అవేష్ ఖాన్- 16 మాత్రమే కొంతమేర జింబాబ్వే బౌలర్లను ప్రతిఘటించగలిగారు.
ఈ సాయంత్రం జరగనున్న రెండో మ్యాచ్ కోసం టీమిండియా తుదిజట్టులో రెండు మార్పులు చోటు చేసుకోవచ్చు. తొలి మ్యాచ్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన వికెట్ కీపర్ ధృవ్ జురెల్ స్థానంలో జితేష్ శర్మను తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయిన ఖలీల్ అహ్మద్‌కు బదులుగా హర్షిత్ రాణాకు చోటు కల్పించవచ్చు.

ఖలీల్ అహ్మద్ ఈ మ్యాచ్‌లో ఘోరంగా విఫలం అయ్యాడు. నాలుగు ఓవర్ల కోటాను సైతం పూర్తి చేయలేకపోయాడు. మూడు ఓవర్లల్లో 28 పరుగులు ఇచ్చుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. దీనితో అతనికి బదులుగా కోల్‌కత నైట్ రైడర్స్ స్టార్ బౌలర్ హర్షిత్ రాణాకు చోటు కల్పించవచ్చు.
తుది జట్టులో- శుభమన్ గిల్ (కేప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా ఆడొచ్చు.












Click it and Unblock the Notifications