టీమిండియా ఖాతాలో మరో విక్టరీ
IND vs ZIM: అయిదు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్స్ సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మూడో మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయాన్ని సాధించింది. 23 పరుగుల తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించింది. ఈ విజయంతో ఈ సిరీస్‌లో 2-1 తేడాతో ఆధిక్యతను సాధించింది. నాలుగో మ్యాచ్ ఈ నెల13వ తేదీన షెడ్యూల్ అయింది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లల్లో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కేప్టెన్ శుభ్‌మన్ గిల్ 66 పరుగులతో కదం తొక్కాడు. 49 బంతుల్లో మూడు సిక్సర్లు, ఏడు ఫోర్లతో చెలరేగాడు. మిడిలార్డర్‌లో రుతురాజ్ గైక్వాడ్ మెరుపు ఇన్నింగ్ ఆడాడు. 28 బంతుల్లో మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 49 పరుగులు చేశాడు.

ఓపెనర్ యశస్వి జైస్వాల్- 36, టాప్ ఆర్డర్ బ్యాటర్ అభిషేక్ శర్మ- 10 పరుగులు చేశారు. సంజు శాంసన్- 12, రింకూ సింగ్ ఒక పరుగుతో నాటౌట్‌గా నిలిచారు. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే పోరాడి ఓడింది. నిర్ణీత 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగలిగింది.
ఓపెనర్లు వెస్లీ మధెవెరె- 1, టడివనషె మరుమని- 13, బ్రియాన్ బెన్నెట్- 4 పరుగులు విఫలం అయినప్పటికీ.. మిడిలార్డర్‌లో డియాన్ మేయర్స్ జట్టును ఆదుకున్నాడు. 49 బంతుల్లో ఒక సిక్సర్, ఏడు ఫోర్లతో 65 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కేప్టెన్ సికందర్ రజా- 15 పరుగులతో మరోసారి విఫలం కాగా.. లోయర్ ఆర్డర్ బ్యాటర్ క్లైవ్ మడండె రెచ్చిపోయి ఆడాడు. 37 పరుగులు చేశాడు.
వారికి సహకరించే బ్యాటర్లు లేకపోవడంతో 159 పరుగుల వద్ద జింబాబ్వే జట్టు ప్రస్థానం ఆగిపోయింది. టీమిండియా బౌలర్లల్లో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. నాలుగు ఓవర్ల కోటాలో 15 పరుగులు మాత్రమే ఇచ్చి సికందర్ రజా, జొనాథన్ క్యాంప్‌బెల్, క్లైవ్ మడండే వికెట్లను తీసుకున్నాడు. అవేష్ ఖాన్- 2, ఖలీల్ అహ్మద్ ఒక వికెట్ తీసుకున్నారు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications