IND vs ZIM: చావో రేవో పోరాటం, సూపర్-8 సంకటంలో భారత్
టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా అడుగుపెట్టిన భారత్‌కు ఇప్పుడు అసలైన అగ్నిపరీక్ష ఎదురైంది. గ్రూప్ దశలో అగ్రస్థానంతో దూసుకెళ్లిన టీమ్ ఇండియాను సూపర్-8లో తగిలిన ఆ ఒక్క దెబ్బ కోలుకోలేని స్థితికి నెట్టింది. గెలిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉండే ఈ "చావో రేవో" పోరాటంలో నేడు జింబాబ్వేతో తలపడనుంది. కేవలం విజయం మాత్రమే సరిపోదు.. దెబ్బతిన్న నెట్ రన్ రేట్‌ను సరిదిద్దుకోవాలంటే భారీ అంతరంతో నెగ్గడం భారత్‌కు అనివార్యం.
భారత్ ఆందోళన అంతా బ్యాటింగ్ చుట్టూనే తిరుగుతోంది. ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ జట్టును కలవరపెడుతోంది. నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం 15 పరుగులు.. అందులో మూడు డకౌట్లు అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటు ఇషాన్ కిషన్ కూడా గత రెండు మ్యాచ్‌ల్లో తడబడటం జట్టుకు మైనస్‌గా మారింది. సూర్యకుమార్, తిలక్ వర్మ పరుగులు చేస్తున్నా, వారి స్ట్రైక్ రేట్ టీ20 ప్రమాణాలకు తగ్గట్టుగా లేదు. ఈ నేపథ్యంలో దూబే, హార్దిక్ పాండ్యాలు ఫినిషర్లుగా ఎంతమేర మెరుపులు మెరిపిస్తారనే దానిపైనే భారత్ భారీ స్కోరు ఆధారపడి ఉంది.

వ్యూహాత్మక మార్పులు: శాంసన్, అక్షర్ ఎంట్రీ!
జింబాబ్వే ఆఫ్‌స్పిన్నర్లను ఎదుర్కోవడానికి మరియు పవర్‌ప్లేలో జోరు పెంచడానికి టీమ్ మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయాలు తీసుకునేలా కనిపిస్తోంది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ల బలహీనతను గమనించిన యాజమాన్యం, సంజు శాంసన్‌ను ఓపెనర్‌గా పంపే అవకాశం ఉంది. అలాగే రింకు సింగ్ జట్టుతో చేరినప్పటికీ, బౌలింగ్ బలాన్ని పెంచేందుకు వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకురావడం దాదాపు ఖాయమైంది. బుమ్రా నేతృత్వంలోని బౌలింగ్ విభాగం భారత్‌కు అతిపెద్ద బలం.
జింబాబ్వేను తక్కువ అంచనా వేయలేం
పేరుకు చిన్న జట్టే అయినా, ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, శ్రీలంక వంటి దిగ్గజాలను మట్టికరిపించిన చరిత్ర జింబాబ్వే సొంతం. సికందర్ రజా వంటి అనుభజ్ఞుడైన కెప్టెన్, ముజరబాని వంటి పదునైన బౌలర్లతో ఆ జట్టు ఏ క్షణమైనా షాక్ ఇవ్వగలదు. కోల్పోయేది ఏమీ లేని జట్టు ఎప్పుడూ ప్రమాదకరమే. ముఖ్యంగా చెన్నై పిచ్ బ్యాటింగ్‌కు సహకరిస్తుండటంతో, భారీ హిట్టర్లు ఉన్న జింబాబ్వేను కట్టడి చేయడం భారత బౌలర్లకు సవాలే.
లెక్కలు తేలాల్సిన సమయం
నెట్ రన్ రేట్ -3.80 వద్ద ఉన్న భారత్, సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో భారీ విక్టరీ సాధించి, ఆపై వెస్టిండీస్‌తో జరిగే పోరులోనూ సత్తా చాటాలి. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ఇప్పటికే మెరుగైన రన్ రేట్‌తో ముందంజలో ఉన్న వేళ.. 'మెయిన్ ఇన్ బ్లూ' విశ్వరూపం ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది.
జట్లు అంచనా..
- ఇండియా: అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్, తిలక్ వర్మ, దూబె, హార్దిక్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా.
- జింబాబ్వే: మరుమాని, బెనెట్, మయర్స్, ర్యాన్ బర్ల్, సికందర్ రజా, మున్యోంగా, ముసెకివా, ఎవాన్స్, క్రీమర్, ముజరబాని, ఎంగరవ.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications