పాకిస్తాన్ పై టీమిండియా జట్టు కూర్పుతోనే గెలుపు సాధ్యం

ఎప్పుడెప్పుడా అంటూ కోట్లాదిమంది ఎదురుచూస్తూ వస్తోన్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్ నేడే. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆర్క్ రైవల్స్ భారత్- పాకిస్తాన్ తలపడనున్నాయి. శ్రీలంక దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఈ సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. దీనికోసం రెండు జట్లూ ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్ సాగిస్తోన్నాయి. పాకిస్తాన్ జట్టు పరిస్థితెలా ఉన్నప్పటికీ.. టీమిండియా మాత్రం ఫిట్ నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతోంది.

ఈ టోర్నమెంట్ లో ఇప్పటివరకూ ఈ రెండు జట్లు కూడా తాము ఆడిన మ్యాచ్ లల్లో ఘన విజయాలు సాధించాయి. అజేయంగా దూసుకుపోతున్నాయి. అమెరికా, నమీబియాలపై భారత్, నెదర్లాండ్స్, అమెరికాపై పాకిస్తాన్ తిరుగులేని గెలుపును అందుకున్నాయి. ఇప్పుడీ రెండు జట్లు నేరుగా తలపడబోతోన్నాయి. పాకిస్తాన్ జట్టులో ఎటువంటి గాయాల బెడద ఉండట్లేదు గానీ..ఈ విషయంలో టీమిండియా క్యాంప్ లో మాత్రం ఆందోళన నెలకొంది.

India Playing 11 Eye T20 World Cup Glory as They Face Salman Ali Agha Pakistan in Colombo Showdown

ఓపెనర్ అభిషేక్ శర్మ ఫిట్‌నెస్‌పై సందేహాలు నెలకొన్నాయి. కడుపునొప్పితో నమీబియా మ్యాచ్‌లో ఆడలేదు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అనంతరం జట్టుతో పాటు కొలంబోకు వచ్చేశాడు కూడా. అభిషేక్ ఆడే అవకాశాలు ఉన్నాయని.. ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా కేప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించడం కొంత ఊరట కలిగిస్తోంది. అతను జట్టులోకి వస్తే.. సంజు శాంసన్ కు చోటు ఉండకపోవచ్చు. ఇదొక్కటీ తప్ప పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.. ప్లేయింగ్ లెవెన్ లో.

పాకిస్తాన్ జట్టులో కూడా మార్పులేవీ ఉండకపోవచ్చు. కేప్టెన్ సల్మాన్ అలీ అఘా గానీ, జట్టు యాజమాన్యం గానీ రిస్క్ తీసుకోదలచుకోలేదు. పెద్దగా మార్పులు చేయాలని భావించట్లేదు. ఇదే విషయాన్ని ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో అలీ అఘా నిర్ధారించాడు కూడా. జట్టులో మార్పులకు అవకాశం లేదని అన్నాడు. ఉస్మాన్ తారిక్ తమకు ప్రధాన ఆయుధంగా మారుతాడనీ వ్యాఖ్యానించాడు. ఐసీసీ టోర్నమెంట్ లల్లో భారత్ ట్రాక్ రికార్డు బాగుందని కితాబిచ్చాడు.

పాకిస్తాన్ పై ఆడే భారత తుది జట్టులో - అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కేప్టెన్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ ఆడే అవకాశం ఉంది.

భారత్ పై ఆడే పాకిస్తాన్ తుది జట్టులో- సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అలీ అఘా (కేప్టెన్), బాబర్ ఆజమ్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రాఫ్, షాహీన్ షా అఫ్రిది, సల్మాన్ మీర్జా, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిక్ కు చోటు దక్కొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+