మిఛెల్ స్టార్క్ భార్య షాకింగ్ డెసిషన్

ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ అలిస్సా హీలీ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ కు మూలస్తంభంలా నిలిచిన అలీస్సా హీలీకి భారత్ లో ఉన్న స్టార్ డమ్ అంతా ఇంతా కాదు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో వికెట్ కీపర్ పాత్రకు కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. ఇప్పుడామె అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. మార్చిలో భారత్‌తో స్వదేశంలో జరిగే సిరీస్‌ అనంతరం రిటైర్మెంట్ కానున్నారు. దీంతో 15 సంవత్సరాల సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు తెరపడనుంది.

'విల్లో టాక్' పాడ్‌కాస్ట్‌లో హీలీ ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్ తో జరగబోయే సిరీస్ తనకు చివరిదని అన్నారు. ఇంకొంత కాలం పాటు కొనసాగాలనే ఆసక్తి ఉన్నప్పటికీ.. ఇన్ని రోజులూ తనను నడిపించిన పోటీతత్వం, వేగం తగ్గిందని భావిస్తున్నట్లు చెప్పారు. తన కేరీర్ ను ముగించడానికి ఇదే సరైన సమయమని స్పష్టం చేశారు. టీ20 ప్రపంచ కప్ సన్నాహాల కోసం ఫిబ్రవరి 15న సిడ్నీలో ప్రారంభమయ్యే మూడు టీ20లకూ హీలీ దూరం కానున్నారు.

India Series to Mark the End of Alyssa Healy s Glorious Australia Career

ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ భార్యగా, ఇయాన్ హీలీ మేనకోడలిగానూ హీలీకి గుర్తింపు ఉంది. మార్చిలో పెర్త్‌లోని వాకా గ్రౌండ్‌లో జరిగే మూడు వన్డేలు, ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు ఆమె కేప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ సిరీస్ తో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోనున్నారు హీలీ. 2010లో 19 ఏళ్ల వయసులో క్రికెట్ లో అరంగేట్రం చేశారామె. మహిళల క్రికెట్‌లో కీలక ప్లేయర్ గా ఎదిగారు. 7,000కు పైగా అంతర్జాతీయ పరుగులు సాధించార.

2022 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో 170 నాటౌట్‌తో రికార్డు సృష్టించారు. ఇది ఏ ఐసీసీ ప్రపంచ కప్ ఫైనల్‌లోనైనా అత్యధిక వ్యక్తిగత స్కోరు. వికెట్ కీపర్‌గా మహిళల టీ20లలో అత్యధిక డిస్మిసల్స్ రికార్డు కూడా హీలీదే. వన్డేలలోనూ ఆమె టాప్ లీడర్. హీలీ కెరీర్‌లో ఎనిమిది ఐసీసీ ప్రపంచ కప్ టైటిల్స్ గెలిచారు. 2018, 2019లో ఐసీసీ ఉమెన్స్ టీ20 ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు.

2019లో బెలిండా క్లార్క్ అవార్డు అందుకున్నారు. మెగ్ లానింగ్ రిటైర్‌మెంట్ తర్వాత 2023లో కెప్టెన్సీ చేపట్టిన హీలీ 2025లో ఇంగ్లాండ్‌పై 16-0తో చారిత్రాత్మక యాషెస్ వైట్‌వాష్ సాధించారు. కెప్టెన్‌గా 80 శాతం విజయాలను ఆమె నమోదు చేశారు. రిటైర్మెంట్ తర్వాత ఆమె మీడియా, బ్రాడ్‌కాస్టింగ్ రంగంలోకి అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కామెంటేటర్ గా ఆమెకు మంచి పేరుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+