సూర్యకు జాక్ పాట్- గిల్ కు రిటర్న్ గిఫ్ట్: వన్డే, టీ20లకు నయా టీమిండియా
భారత జట్టు వన్డే ఫార్మట్ కేప్టెన్ గా శుభ్ మన్ గిల్ అపాయింట్ కానున్నాడు. ప్రస్తుతం అతను టెస్ట్ ఫార్మట్ లో జట్టుకు సారథ్యాన్ని వహిస్తోన్నాడు. ఇంగ్లాండ్ తో అయిదు మ్యాచ్ ల సిరీస్, వెస్టిండీస్ తో తొలి టెస్ట్ లో జట్టును విజయపథం వైపు నడిపించిన కారణంగా గిల్ కు రిటర్న్ గిఫ్ట్ లభించినట్టయింది. ప్రస్తుతం వన్డే ఫార్మట్ లో జట్టుకు కేప్టెన్ గా వ్యవహరిస్తోన్న రోహిత్ శర్మపై వేటు పడింది. జట్టులో చోటు కల్పించినప్పటికీ- కేప్టెన్ గా తప్పుకోవాల్సి వచ్చింది.
భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. మొత్తం మూడు వన్డేలు, అయిదు టీ20 మ్యాచ్ లల్లో ఆసీస్ తో తలపడుతుంది. తొలి వన్డే మ్యాచ్ ఈ నెల 19వ తేదీన. పెర్త్ దీనికి వేదిక. 23, 25 తేదీల్లో అడిలైడ్, సిడ్నీల్లో మిగిలిన రెండు వన్డేలు జరుగుతాయి. 29 నుంచి టీ20 సిరీస్ ఆరంభమౌతుంది. తొలి మ్యాచ్ కు క్యాన్ బెర్రా వేదిక. 31, నవంబర్ 2, 6, 8 తేదీల్లో మెల్ బోర్న్, హోబర్ట్, గోల్డ్ కోస్ట్, బ్రిస్బేన్ లల్లో మిగిలిన మ్యాచ్ లు జరుగుతాయి.

ఈ రెండు సిరీస్ కోసం వేర్వేరుగా జట్టును ప్రకటించింది బీసీసీఐ. వన్డేలకు గిల్ సారధ్య బాధ్యతలను తీసుకోనున్నాడు. టీ20 ఇంటర్నేషనల్స్ కు సూర్యకుమార్ యాదవ్ సారధిగా కొనసాగుతున్నాడు. మొత్తం 15 మంది సభ్యులు చొప్పున గల వన్డే, టీ20 జట్టును బీసీసీఐ కొద్దిసేపటి కిందటే ప్రకటించింది. ఈ రెండింట్లోనూ చెప్పుకోదగ్గ మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. రెండింట్లో కూడా యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది.
🚨 India’s squad for Tour of Australia announced
— BCCI (@BCCI) October 4, 2025
Shubman Gill named #TeamIndia Captain for ODIs
The #AUSvIND bilateral series comprises three ODIs and five T20Is against Australia in October-November pic.twitter.com/l3I2LA1dBJ
వన్డే జట్టులో- శుభ్ మన్ గిల్ (కేప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కేప్టెన్) అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్ దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, అర్ష్ దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్ ఎంపికయ్యారు. కేఎల్ రాహుల్ ను రెగ్యులర్ వికెట్ కీపర్ గా తీసుకుంటూ జురెల్ ను స్టాండ్ బైగా చోటు కల్పించారు.
టీ20 జట్టులో- సూర్యకుమార్ యాదవ్ (కేప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్ మన్ గిల్ (వైస్ కేప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివం దుబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ ప్రీత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, కుల్ దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్ ఎంపికయ్యారు.












Click it and Unblock the Notifications