Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. 10 ఓవర్లలోనే ఆట ఖతం!

IND vs PAK: టీ20 ప్రపంచ కప్‪లో నేడు భారత్-పాకిస్థాన్ పురుషుల జట్ల మధ్య జరగనున్న హై-వోల్టేజ్ పోరుకు ముందు భారత మహిళా జట్టు అభిమానులకు భారీ తీపి కబురు అందించింది. ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్లో భాగంగా జరిగిన కీలక మ్యాచ్‌లో భారత మహిళా ఏ జట్టు పాకిస్థాన్‌ను 8 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. కేవలం 10.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి దాయాది జట్టుపై ఘనవిజయం సాధించింది.

నిప్పులు చెరిగిన భారత బౌలర్లు
బ్యాంకాక్‌లోని టెర్డ్‌థాయ్ క్రికెట్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే భారత బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు ఏ దశలోనూ నిలదొక్కుకోలేకపోయారు. ముఖ్యంగా స్పిన్నర్లు తమ మాయాజాలంతో పాకిస్థాన్‌ను కట్టడి చేశారు. కెప్టెన్ రాధా శర్మ (2 వికెట్లు), ప్రేమా రావత్ (2 వికెట్లు), మిన్నూ మణి (1 వికెట్) ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశారు. పేసర్ సైమా ఠాకూర్ కూడా 2 వికెట్లతో రాణించడంతో పాకిస్థాన్ జట్టు 18.5 ఓవర్లలో కేవలం 93 పరుగులకే కుప్పకూలింది.

India vs Pakistan India Women Win by 8 wickets in Asia Cup Rising Stars Vrinda Sharma Leads Victory

వృందా శర్మ మెరుపు హాఫ్ సెంచరీ
94 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ప్రారంభంలోనే హుమైరా ఖాజీ వికెట్‌ను కోల్పోయినా.. ఓపెనర్ వృందా శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. కేవలం 29 బంతుల్లోనే 12 ఫోర్ల సాయంతో అజేయంగా 55 పరుగులు చేసి పాక్ బౌలర్లను ఆడుకుంది. ఆమెకు అనుష్క శర్మ (24) చక్కని సహకారం అందించింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయాన్ని ఖాయం చేశారు. చివరిలో తేజల్ హసబ్నిస్ కేవలం 5 బంతుల్లోనే ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో 12 పరుగులు చేసి 10.1 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించింది.

సెమీఫైనల్ దిశగా భారత్
తొలి మ్యాచ్‌లో యూఏఈ చేతిలో ఓడిపోయిన భారత్‌కు, సెమీఫైనల్ రేసులో నిలవాలంటే పాకిస్థాన్‌పై గెలవడం అత్యవసరం. ఈ విజయంతో గ్రూప్-ఏలో భారత్ రెండో స్థానానికి చేరుకుంది. భారత జట్టు తన తదుపరి మ్యాచ్‌లో నేపాల్‌తో తలపడనుంది. ఆ మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తే సెమీఫైనల్ బెర్త్ ఖరారు అవుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+