రేపే తొలి వన్డే: అందరి కళ్లూ మీమీదే- కుమ్మేయాలండోయ్
ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న భారత్-ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ కు గడువు సమీపించింది. ఆదివారం తొలి వన్డే ఆరంభం కాబోతోంది. పెర్త్ దీనికి వేదిక. భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. దీంతో- మూడు మ్యాచ్‌ల వనన్డే సిరీస్ కు శ్రీకారం చుట్టినట్టవుతుంది. వన్డే కేప్టెన్ గా అపాయింట్ అయిన తర్వాత శుభ్‌మన్ గిల్ కు తొలి సిరీస్ కూడా ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ మ్యాచ్ లో అందరి చూపూ మాజీ కేప్టెన్ రోహిత్ శర్మ, టాప్ ఆర్డర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మీదే నిలుస్తుందనడంలో సందేహాలు అక్కర్లేదు. 2027 ఐసీసీ వరల్డ్ కప్ వరకూ జట్టులో కొనసాగాలంటే వీరిద్దరూ ఈ సిరీస్ లో అంచనాలకు మించి రాణించాల్సి ఉంటుంది. పైగా- కేప్టెన్సీ పోయిన తర్వాత రోహిత్ శర్మ ఆడుతున్న తొలి మ్యాచ్ కూడా ఇదే కావడం అతనిపై మరింత ఉండే అవకాశం లేకపోలేదు. ఈ మూడు మ్యాచ్ లల్లో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. కేరీర్ క్లోజ్ అవ్వక తప్పకపోవచ్చు.

50 ఓవర్ల ఫార్మట్ లో సాగిన ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్లీ గ్రౌండ్ లో దిగడం ఇదే తొలిసారి కూడా. స్పెషలిస్ట్ వికెట్ కీపర్ గా కేఎల్ రాహుల్ తుదిజట్టులో చోటు దక్కించుకోవచ్చు. బ్యాటింగ్ ఆర్డర్ కు వెన్నెముకగా భావించే నంబర్ 4 స్థానంలో వైస్ కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బరిలో దిగొచ్చు. జస్ ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోవడం వల్ల బౌలింగ్ డిపార్ట్మెంట్ కు మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ లీడ్ చేయాల్సి ఉంటుంది. వాషింగ్టన్ సుందర్, కుల్ దీప్ యాదవ్ స్పిన్నర్లుగా ఆడటం దాదాపుగా ఖాయమైనట్టే. ఆల్ రౌండర్లుగా అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి ఈ తొలి మ్యాచ్ కు ఎంపిక కావచ్చు.
మరోవైపు- మిచెల్ మార్ష్ నాయకత్వాన్ని వహిస్తోన్న ఆస్ట్రేలియా.. టీమిండియాను ఎలా ఎదుర్కొంటునేది ఆసక్తి రేపుతోంది. గాయాలు ఆ జట్టును కలవరపెడుతున్నాయి. మాట్ రెన్‌షా, మిచ్ ఓవెన్ మిడిల్ ఆర్డర్‌లో వన్డేల్లో అరంగేట్రం చేయనున్నారు. జోష్ ఫిలిప్ 2021 తర్వాత తన తొలి వన్డే ఆడనున్నాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్ మాట్ కుహ్నెమాన్ కూడా తొలి మ్యాచ్ ఆడనున్నాడు. స్వదేశంలో ఇదే అతనికి తొలి మ్యాచ్ అవుతుంది. ఆడనున్నాడని అన్నారు.
టీమిండియా తుదిజట్టులో- రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కేప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్ దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ చోటు దక్కించుకునే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియా తుదిజట్టులో- ట్రావిస్ హెడ్, మిఛెల్ మార్ష్ (కేప్టెన్), మాట్ షార్ట్, మాట్ రెన్షా, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), మిఛెల్ ఓవెన్, కూపర్ కోనోలీ, మిఛెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, మాట్ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్ ఆడొచ్చు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications