టీమిండియా బిగ్ వికెట్ డౌన్- న్యూజిలాండ్ తో సిరీస్ నుంచి స్టార్ ప్లేయర్ అవుట్
క్రికెట్ హంగామా ఆరంభం కాబోతోంది. నేటి నుండి భారత్- న్యూజిలాండ్ మధ్య సిరీస్ మొదలు కానుంది. మూడు వన్డేలు, అయిదు టీ20 మ్యాచ్ ల సిరీస్ ఇది. ఈ మధ్యాహ్నం 1:30 గంటలకు తొలి మ్యాచ్. గుజరాత్ లోని వడోదర స్టేడియం దీనికి వేదిక. ఆ తర్వాత 14న రాజ్ కోట్, 18న ఇండోర్ లల్లో మిగిలిన రెండు మ్యాచ్ లు జరుగుతాయి. 21వ తేదీ నుంచి టీ20 ఇంటర్నేషనల్స్ ఆరంభం కానున్నాయి. ఈ రెండు సిరీస్ ల కోసం ఇప్పటికే జట్టును కూడా ప్రకటించింది బీసీసీఐ.
ఈ పరిస్థితుల మధ్య భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయపడ్డాడు. ఈ సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. కుడి పక్కటెముకల గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందతనికి. వడోదర గ్రౌండ్‌లో ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా పంత్ గాయపడ్డాడు. త్రోడౌన్ స్పెషలిస్ట్ వేసిన బంతి నడుము పైభాగానికి తగిలింది. దీంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు.

తీవ్రమైన నొప్పితో విలవిల్లాడాడు. బంతి తగిలిన వెంటనే మోకాళ్లపై కూర్చుండిపోయాడు. సపోర్టింగ్ స్టాఫ్ సహాయంతో నెట్స్‌ను వీడాడు. పంత్ కుడివైపు పక్కటెముకలకు దెబ్బ తగిలిందని, సైడ్ స్ట్రెయిన్ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. రిషబ్ పంత్ కుడివైపు పక్కటెముకలకు బంతి బలంగా తగలడంతో పాటు, సైడ్ స్ట్రెయిన్ కూడా ఉన్నట్లు తేలింది. అందుకే అతను న్యూజిలాండ్‌తో జరిగే ఈ వన్డే సిరీస్ నుండి తప్పుకోవాల్సి వచ్చిందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత రిహాబిలిటేషన్ కోసం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు వెళ్లనున్నాడు. ఈ గాయం నేపథ్యంలో మూడు వన్డేల సిరీస్ నుంచి అతను తప్పుకొన్నట్టయింది. గత ఏడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన రెండు టెస్టుల సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి వచ్చిన పంత్ గాయపడటం.. ఇది రెండోసారి. మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్ లో అతని కుడి కాలికి ఫ్రాక్చర్ అయిన విషయం తెలిసిందే.
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు పంత్‌ను జట్టు నుంచి తొలగిస్తారని ఊహాగానాలు నెలకొన్నప్పటికీ, అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ఎంపిక కమిటీ అతన్ని జట్టులో ఉంచింది. ఇప్పుడు పంత్ అందుబాటులో లేకపోవడంతో, అతని స్థానంలో ఎవరిని తీసుకోవాలనేది బీసీసీఐ ఇంకా నిర్ధారించలేదు. విజయ్ హజారే ట్రోఫీలో తడాఖా చూపిన ధ్రువ్ జురెల్, టీ20 వరల్డ్ కప్ కు ఎంపికైన ఇషాన్ కిషన్.. పంత్‌కు ప్రత్యామ్నాయంగా నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications