IPL 2024: రాజస్థాన్ రాయల్స్‌కు బిగ్ షాక్: స్టార్ ప్లేయర్ అవుట్

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్ సమీపించింది. ఈ మెగా టోర్నమెంట్ ఆరంభం కావడానికి ఎంతో సమయం లేదు. ఇంకో మూడు నెలల్లో ఐపీఎల్ 2024 (IPL 2024) ఆరంభం కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి/మార్చి నెలల్లో ఐపీఎల్ 2024 సీజన్‌లో మొత్తం 10 జట్లు పోరాడనున్నాయి.

రెండున్నర నెలల పాటు అంటే 74 రోజుల పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే బిగ్గెస్ట్ టోర్నమెంట్ ఇది. దీని కోసం ఇప్పటి నుంచే సన్నాహకాలు సాగుతున్నాయి. నేడు రిటెన్షన్ (Retention) జరుగనుంది. మినీ వేలం పాట (IPL 2024 auction) ఏర్పాటైంది. రిటెన్షన్ ప్లేయర్ల లిస్ట్ ఇదివరకే వెలువడింది.

IPL 2024: After Ben Stokes, now Joe Root has pulled out

రిటెన్షన్ వేళ.. రాజస్థాన్ రాయల్స్‌ (Rajasthan Royals) కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ జో రూట్ (Joe Root).. ఐపీఎల్ 2024 నుంచి తప్పుకొన్నాడు. ఈ టోర్నమెంట్ మొత్తానికీ దూరం అయ్యాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు అందుబాటులో ఉండట్లేదంటూ ఓ ప్రకటన విడుదల చేశాడు.

ఐపీఎల్ 2024 నుంచి వైదొలగిన రెండో ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్. ఇదివరకు బెన్ స్టోక్స్ (Ben Stokes) ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) తరఫున ఆడుతున్నాడీ ఆల్ రౌండర్. వచ్చే సీజన్‌లో ఆడట్లేదంటూ ఇదివరకే ప్రకటించాడు. ఇప్పుడు తాజాగా జో రూట్.. ఈ లిస్ట్‌లో చేరాడు.

IPL 2024: After Ben Stokes, now Joe Root has pulled out

ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ నిర్ధారించింది. జో రూట్ ఆడట్లేదని తెలిపింది. రిటెన్షన్ ప్రారంభం కానున్నందున ఐపీఎల్ 2024 సీజన్ కోసం అతని స్థానంలో మరో ప్లేయర్‌ను తీసుకోవాల్సి ఉందని రాయల్స్ డైరెక్టర్ కుమార సంగక్కార తెలిపాడు. అతను జట్టులో లేని లోటు కనిపిస్తుందని వ్యాఖ్యానించాడు.

ఐపీఎల్ 2023 వేలం పాట సందర్భంగా జో రూట్‌ను తీసుకుంది ఆర్ఆర్. కోటి రూపాయల బేస్ ప్రైజ్‌తో కొనుగోలు చేసింది. అతను ఐపీఎల్ ఆడటం ఇదే మొదటిసారి. పెద్దగా రాణించలేకపోయాడు. మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అందులోనూ ఒక్క ఇన్నింగ్‌లో మాత్రమే అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. 10 పరుగులు చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+