Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL 2024: ఆర్సీబీకి భారీ షాక్ - 17.5 కోట్లు పెట్టి కొన్న ప్లేయర్ కు కరోనా.. !

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) ప్రారంభానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు (RCB)కి ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా జరిగిన ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ.17.5 కోట్లు పెట్టి దక్కించుకున్న ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కు తాజాగా కరోనా పాజిటివ్ గా తేలింది. వెస్టిండీస్ తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్ లో భాగంగా బ్రిస్బేన్ లో రెండో మ్యాచ్ కు సిద్దమవుతున్న తరుణంలో కంగారూ జట్టులో పలువురికి కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి.

ఐపీఎల్ 2024 వేలంలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ (Cameron Green) ను రాయల్ ఛాలెంజర్స్ జట్టు రూ.17.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీలో కామెరూన్ గ్రీన్ జట్టులో చేరితే కచ్చితంగా అదనపు ప్రయోజనం ఉంటుందని ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇలాంటి తరుణంలో స్వదేశంలో వెస్టిండీస్ తో టెస్టు సిరీస్ ఆడుతున్న కామెరూన్ గ్రీన్ పాటు ఆస్ట్రేలియా జాతీయ జట్టు కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ కూడా కరోనా పాజిటివ్ గా తేలారు. దీంతో ప్రస్తుతానికి గ్రీన్ ను క్వారంటైన్ కు పంపి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.

IPL 2024: big shock to royal challengers Bengaluru as 17.5 cr player tested covid 19 Positive

కామెరూన్ గ్రీన్ తో పాటు కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ కు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ గా తేలినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా నిర్దారించింది. అయితే వీరిద్దరినీ కరోనా నెగెటివ్ ఫలితాలు వచ్చే వరకూ టీమ్ నుంచి వేరుగా ఉంచనున్నట్లు వెల్లడించింది.వాస్తవానికి క్రికెట్ ఆస్ట్రేలియా ఆటగాళ్ల నిబంధనల ప్రకారం వారికి కరోనా సోకినా తిరిగి నెగెటివ్ ఫలితాలు వచ్చే వరకూ ఎదురు చూడకుండా మ్యాచ్ లు ఆడేందుకు అనుమతిస్తారు. అయితే ఇలా కరోనా సోకిన ఆటగాళ్లు జట్టులో సహచరులకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. దీంతో వెస్టిండీస్ తో రెండో టెస్టులో ఫిట్ నెస్ ఉంటే కామెరూన్ గ్రీన్ ఆడే అవకాశాలున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+