అంతంత పెట్టి కొన్నందుకు..!!

Pat Cummins: ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్‌‌ను మట్టికరిపించింది. ఫైనల్స్‌లో అడుగు పెట్టింది. ఈ నెల 26వ తేదీన జరిగే ఫైనల్స్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్‌ను ఢీ కొట్టబోతోంది. ఇందులో గెలిస్తే మరోసారి ఛాంపియన్‌గా నిలుస్తుందీ టీమ్.

చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తుగా ఓడించింది ఆరెంజ్ ఆర్మీ. తొలుత బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్.. మరోసారి విజృంభించాడు. 34 బంతుల్లో నాలుగు భారీ సిక్సర్లతో సరిగ్గా హాఫ్ సెంచరీ చేశాడు.

IPL 2024 KKR vs SRH final Expensive players Pat Cummins and Mitchell Starc set to play end game

రాహుల్ త్రిపాఠి- 37, ట్రావిస్ హెడ్- 34 మాత్రమే బ్యాటింగ్‌లో రాణించగలిగారు. చివర్లో షాబాజ్ అహ్మద్ 18 పరుగులు జత చేయడంతో పోరాడ దగ్గ స్కోర్‌ను సాధించింది సన్‌రైజర్స్. అనంతరం బౌలింగ్‌లో ఎస్ఆర్‌హెచ్ రెచ్చిపోయింది. రాజస్థాన్ రాయల్స్‌ను 139 పరుగుల వద్దే కట్టడి చేసింది. 36 పరుగుల తేడాతో జయకేతనాన్ని ఎగురవేసింది.

బ్యాటర్లు తడబడినప్పటికీ.. బౌలర్లు సత్తా చాటారు. ప్రత్యేకించి స్పిన్నర్లు. పార్ట్ టైమ్ స్పిన్నర్లతో జట్టును విజయ తీరాలకు చేర్చగలిగాడు కేప్టెన్ పాట్ కమ్మిన్స్. షాబాజ్ అహ్మద్ మూడు వికెట్లు కూల్చాడు. పార్ట్‌ టైమ్ బౌలర్ అభిషేక్ శర్మ రెండు వికెట్లు తీసుకుని రాయల్స్ బ్యాటింగ్ ఆర్డర్ నడ్డి విరిచాడు.

26వ తేదీన చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో కోల్‌కత నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే ఫైనల్స్ పోరుకు ఓ ప్రత్యేకత ఏర్పడింది. మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ప్లేయర్లు పాట్ కమ్మిన్స్, మిఛెల్ స్టార్క్ తలపడబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. వేర్వేరు జట్ల తరఫున ఆడుతున్న ఖరీదైన ఆటగాళ్లిద్దరూ ఫైనల్స్ ఆడబోతోండటం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి.

మెగా వేలం పాట సందర్భంగా 20.50 కోట్ల రూపాయలు పెట్టి ఆస్ట్రేలియా వన్డే ఫార్మట్ కేప్టెన్ పాట్ కమ్మిన్స్‌ను కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. గత ఏడాది భారత్‌లో జరిగిన ఐసీసీ వరల్డ్ కప్‌లో తన దేశాన్ని ఛాంపియన్‌గా నిలిపినందున అతనిపై నమ్మకాన్ని ఉంచింది. ఈ నమ్మకం వమ్ము కాలేదు. తన జట్టును ఫైనల్స్ చేర్చగలిగాడు పాట్ కమ్మిన్స్.

అటు కోల్‌కత నైట్ రైడర్స్ కూడా అంతే. ఆస్ట్రేలియాకే చెందిన ఫాస్ట్ బౌలర్ మిఛెల్ స్టార్క్‌ను ఏకంగా 24.75 కోట్ల రూపాయలు పెట్టి జట్టులోకి తీసుకుంది. వీళ్లిద్దరి మీద ఈ రెండు జట్లు ఏకంగా 45.25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయి. లీగ్స్, ప్లేఆఫ్స్‌లో ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలు చూపాడు స్టార్క్. 15 వికెట్లు పడగొట్టాడు. క్వాలిఫయర్ 1లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి ఫైనల్స్‌లో ఢీకొట్టబోతోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+