ఐపీఎల్ 2024 నుంచి రూ. 6.4 కోట్ల స్టార్ ప్లేయర్ అవుట్

Shivam Mavi: ఐపీఎల్ 2024 సీజన్‌లో దూకుడుగా ఆడుతోంది లక్నో సూపర్ జెయింట్స్. ఓటమితో ఈ సీజన్‌ను ఆరంభించినప్పటికీ.. ఆ తరువాత ఆ జట్టు ఆటతీరు గాడిన పడింది. వరుసగా రెండు విజయాలను అందుకుంది. మూడు మ్యాచ్‌లల్లో రెండింట్లో గెలిచి.. నాలుగు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.

సోమవారం రాత్రి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్‌ను చిత్తుగా ఓడించింది లక్నో సూపర్ జెయింట్స్. తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికార్ టాప్ స్కోరర్.

IPL 2024 Lucknow Super Giants Shivam Mavi has been ruled out with an injury

56 బంతుల్లో అయిదు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో 81 పరుగులు చేశాడీ లెఫ్ట్ హ్యాండర్ వికెట్ కీపర్ బ్యాటర్. చివర్లో నికొలస్ పూరన్ మెరుపు ఇన్నింగ్ ఆడాడు. 21 బంతుల్లో అయిదు భారీ సిక్సులు, ఒక ఫోర్‌తో 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్.. ఈ స్కోర్‌ను అందుకోలేకపోయింది. 19.4 ఓవర్లల్లో 153 పరుగులకు ఆలౌట్ అయింది.

ఇక తన తదుపరి మ్యాచ్‌ను ఈ నెల 7వ తేదీన ఆడాల్సి ఉంది లక్నో సూపర్ జెయింట్స్‌కు. లక్నోలోని ఏక్నా స్పోర్ట్స్ సిటీ స్టేడియం దీనికి వేదిక. సాయంత్రం 7: 30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతుంది.

బలమైన గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితిలో లక్నో‌ సూపర్ జెయింట్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆల్‌రౌండర్ శివం మావి.. జట్టుకు దూరం అయ్యాడు. గాయం కారణంగా మొత్తం ఐపీఎల్ 2024 సీజన్ నుంచే తప్పుకోవాల్సి వచ్చిందతనికి. ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదతను.

ఐపీఎల్ 2024 ఫస్టాఫ్‌కు దూరంగా ఉన్నప్పటికీ.. సెకెండ్ హాఫ్ నాటికి అందుబాటులోకి వస్తాడంటూ మొదట్లో వార్తలొచ్చాయి. అవి వాస్తవ రూపాన్ని దాల్చలేకపోయాయి. గాయం వల్ల మరి కొంతకాలం శివం మావికి విశ్రాంతి అవసరమౌతుందని బీసీసీఐ మెడికల్ టీమ్ వెల్లడించింది. దీనితో అతను ఈ సీజన్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 6.4 కోట్ల రూపాయలతో అతన్ని జట్టులోకి తీసుకుంది లక్నో ఫ్రాంఛైజీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+