Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL 2024: ఐపీఎల్ 2024లో కొత్త రూల్: బ్యాటర్ల ఆటలు ఇక సాగవ్..!!

మచ్ అవైటెడ్ మెగా ఈవెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్ సమీపిస్తోంది. ఈ బిగ్గెస్ట్ టోర్నమెంట్ ఆరంభం కావడానికి ఎంతో సమయం లేదు. ఇంకో రెండు నెలల్లో ఐపీఎల్ 2024 (IPL 2024) ఆరంభం కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి/మార్చి నెలల్లో ఐపీఎల్ 2024 సీజన్‌లో మొత్తం 10 జట్లు పోరాడనున్నాయి.

రెండున్నర నెలల పాటు అంటే 74 రోజుల పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే బిగ్గెస్ట్ టోర్నమెంట్ ఇది. దీని కోసం ఇప్పటి నుంచే సన్నాహకాలు సాగుతున్నాయి. అన్ని ఫ్రాంఛైజీలు తమ జట్లను సరికొత్తగా రూపుదిద్దుతున్నాయి. గెలుపు గుర్రాలను జట్టులోకి తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తోన్నాయి.

IPL 2024: new rule was introduced as two bouncers allowed per over

నేడు ఐపీఎల్ 2024 మెగా ఆక్షన్ (IPL 2024 auction) జరుగనుంది. దుబాయ్ దీనికి వేదిక. మధ్యాహ్నం ఒంటిగంటకు వేలం ఆరంభమౌతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. భారత్‌లో జియో సినిమా దీన్ని స్ట్రీమింగ్ చేయనుంది.

మెగా వేలం పాట కోసం మొత్తంగా 333 మంది ప్లేయర్లు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. క్రికెట్ ఆడే అన్ని జట్లకు చెందిన స్టార్ ప్లేయర్లందరూ ఈ జాబితాలో ఉన్నారు. వీరిలో 214 మంది భారత్, 119 మంది విదేశీ ప్లేయర్లు. 116 మంది క్యాప్డ్, 215 మంది అన్ క్యాప్డ్ ఉన్నారు.

ఐపీఎల్ 2024లో కొత్త నిబంధనను మనం చూడబోతోన్నాం. బ్యాటర్ల దూకుడును కట్టడి చేయడానికి ఉద్దేశించినట్టే కనిపిస్తోంది ఈ రూల్. భారీ షాట్లు ఆడే బ్యాటర్లకు ధీటుగా స్పందించేలా, వారి స్పీడుకు బ్రేకులు వేసేలా బౌలర్లకు కొత్త అస్త్రాన్ని అందించినట్టయింది ఈ నిబంధన ద్వారా.

ఈ ఐపీఎల్ 2024లో ప్రతి ఓవర్‌కూ రెండు బౌన్సర్లను సంధించేలా కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది కమిటీ. ఇది బౌలర్లకు కొంత రిలీఫ్ కల్పించేదే. జోరుగా ఆడుతున్న బ్యాటర్లను బౌన్సర్లతో భయపెట్టే ప్రయత్నం చేస్తుంటారు బౌలర్లు. అలాంటి బౌనర్లు ఇకపై ఓవర్‌కు రెండు సంధించేలా వెసలుబాటు లభించింది.

ఈ నిబంధన బౌలర్లకు సహకరిస్తుందని జయదేవ్ ఉనద్కత్ వ్యాఖ్యానించారు. ఈ చిన్న మార్పు గెలుపోటములను ఎంతగానో ప్రభావితం చేస్తుందని పేర్కొన్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌లో ఎలాంటి మార్పులూ చేయలేదు. అది యధాతథంగా అమలవుతుంది. ఐపీఎల్ 2023లో తొలిసారిగా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను ఇంట్రడ్యూస్ చేసిన విషయం తెలిసిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+