IPL 2024: రోహిత్ తొలగింపుపై ముంబై కోచ్ కామెంట్స్-భార్య రితిక ఘాటు కౌంటర్.. !

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ దగ్గరపడుతోంది. అయితే ఈ సీజన్ కు సంబంధించి ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తొలగిస్తూ యాజమాన్యం తీసుకున్న నిర్ణయంపై మాత్రం రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రోహిత్ ను ముంబై కెప్టెన్సీ నుంచి తొలగించడాన్ని తప్పుబడుతూ నాలుగు లక్షల మంది అభిమానులు ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా అకౌంట్ల నుంచి తప్పుకున్నారు. పలువురు మాజీలు కూడా ఈ నిర్ణయంపై మిశ్రమంగా స్పందించారు. అయినా ముంబై ఫ్రాంచైజీ మాత్ర తన నిర్ణయం మార్చుకోలేదు.

ఈ నేపథ్యంలో తాజాగా ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్, దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్ కూడా అయిన మార్క్ బౌచర్ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి ఎందుకు తొలగించాల్సి వచ్చిందనే దానిపై వివరణ ఇచ్చాడు. ఇందులో టీమ్ ఫ్రాంచైజీ నిర్ణయాన్ని సమర్ధించేలా పలు వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ గత 10 సీజన్లుగా కెప్టెన్ గానే ఉన్నాడని, కానీ కొన్నేళ్లుగా ఈ ప్రభావం అతని బ్యాటింగ్ పై పడుతోందన్నాడు. అందుకే జట్టులో చేపడుతున్న మార్పుల్లో భాగంగా రోహిత్ ను మార్చేశామన్నాడు.

IPL 2024: Rohit Sharmas wife reacted to MI head coachs justification on Captaincy Removal

దీనిపై రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే ఘాటుగా స్పందించింది. ఇప్పటికే రోహిత్ శర్మను తొలగించి ఆ స్ధానంలో హార్దిక్ పాండ్యాను తీసుకోవడం వెనుక ఏదో జరిగిందన్న అనుమానాల్ని ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. రితిక వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో పోడ్‌కాస్ట్ పోస్ లో తాజాగా రితిక .. బౌచర్ వ్యాఖ్యలపై స్పందించింది. "ఇందులో చాలా విషయాలు తప్పు" అని ఆమె తెలిపింది. దీంతో రోహిత్ కెప్టెన్సీ తొలగింపు వెనుక ఏదో జరిగిందన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+