నేడు క్వాలిఫయర్ 2: గెలిస్తేనే ఫైనల్స్: సన్‌రైజర్స్ తుదిజట్టు కూర్పుపై అంచనాలు ఇవీ

RR vs SRH Qualifier 2: ఐపీఎల్ 2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్.. నేడు క్వాలిఫయర్ 2 ఆడబోతోంది. రాజస్థాన్ రాయల్స్‌‌ను ఢీకొట్టనుంది. ఫైనల్స్ చేరాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.

అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో మంగళవారం రాత్రి జరిగిన క్వాలిఫయర్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది సన్‌రైజర్స్. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఈ ఆరెంజ్ ఆర్మీ 19.3 మూడు ఓవర్లల్లో 159 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఈ స్కోర్‌ను అలవోకగా కొట్టేసింది కేకేఆర్. ఫైనల్స్‌లో అడుగు పెట్టింది.

IPL 2024 RR vs SRH Qualifier 2 Sunrisers Hyderabad playing 11 against Rajasthan Royals

ఫైనల్స్ ఎంట్రీ టికెట్ వంటి ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ బ్యాటర్లు విఫలం అయ్యారు. ట్రావిస్ హెడ్ డకౌట్‌తో వికెట్ల పతనం మొదలైంది. అభిషేక్ శర్మ-3, నితీష్ కుమార్ రెడ్డి- 9, షాబాజ్ అహ్మద్- 0, అబ్దుల్ సమద్- 16, సన్వీర్ సింగ్-0, భువనేశ్వర్ కుమార్- 0 అయ్యారు. టాప్ ఆర్డర్‌లో రాహుల్ త్రిపాఠి- 55, మిడిలార్డర్‌లో హెన్రిచ్ క్లాసెన్- 32, చివర్లో కేప్టెన్ పాట్ కమ్మిన్స్- 30 పరుగులతో కొంతవరకు పోరాడారు.

లీగ్స్ దశలో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచినందున ఫైనల్స్‌లో అడుగు పెట్టడానికి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో ఛాన్స్ లభించింది. క్వాలిఫయర్ 2లో ఆడే అవకాశాన్ని దక్కించుకుంది. ఎలిమినేటర్‌లో విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్‌ను ఢీ కొట్టాల్సి ఉంది. ఇందులో గెలిచినా చాలు.. సన్‌రైజర్స్ టీమ్ ఫైనల్స్‌లో అడుగుపెట్టగలుగుతుంది. కేకేఆర్‌తో మరోసారి తలపడుతుంది.

2016 తరువాత మళ్లీ ఫైనల్స్ ముఖం చూడలేదు సన్‌రైజర్స్ హైదరాబాద్. ఆ సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచింది. సగర్వంగా కప్‌ను ముద్దాడింది. ఎలిమినేటర్‌ ఆడి, ఫైనల్స్ చేరీ విజేతగా నిలిచిన ఏకైక జట్టు ఇదొక్కటే. ఇప్పుడు మళ్లీ అలాంటి అద్భుత అవకాశం లభించింది. క్వాలిఫయర్ 2లో సంజు శాంసన్ సైన్యాన్ని నిలువరించగలుగుతుందని ఆశిస్తోన్నారు అభిమానులు.

కీలక మ్యాచ్‌లో తుదిజట్టుపై మంచి అంచనాలే ఉన్నాయి. బ్యాటింగ్‌ను బలోపేతం చేయాలనుకుంటే వారు విజయకాంత్ వియాస్కాంత్‌ను రీప్లేస్ చేయవచ్చు. అతని స్థానంలో ఎయిడెన్ మార్క్‌రమ్ లేదా గ్లెన్ ఫిలిప్స్‌లో ఒకరిని తుదిజట్టులోకి తీసుకోవచ్చు. మార్క్‌రమ్, గ్లెన్ ఫిలిప్స్.. ఇద్దరికీ ఆఫ్‌ స్పిన్‌ను ఎదుర్కొనగలిగే సత్తా ఉంది.

బౌలింగ్‌ను బలోపేతం చేయాలనుకుంటే సన్వీర్ సింగ్ స్థానంలో లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండేకు తుదిజట్టులో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. సన్‌రైజర్స్ మొదట బ్యాటింగ్ చేస్తే.. ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, కేప్టెన్ పాట్ కమిన్స్ ఆడటం ఖాయం. ఆ తరువాత వారు బ్యాటింగ్ లేదా బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను సబ్‌స్టిట్యూట్‌గా బరిలో దింపే ఛాన్స్ ఉంది

సన్‌రైజర్స్ తుదిజట్టులో- ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్/గ్లెన్ ఫిలిప్స్/విజయకాంత్ వియస్కాంత్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమ్మిన్స్ (కేప్టెన్), భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్/మయాంక్ మార్కండే ఆడొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+