Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఐపీఎల్ 2024 చివరి నిమిషంలో కొత్త ముఖాలకు చోటు: షమీ అవుట్

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్ ప్రారంభ తేదీ సమీపించింది. ఈ మెగా టోర్నమెంట్ ఆరంభం కావడానికి ఎంతో సమయం లేదు. శుక్రవారం నాడే తొలి మ్యాచ్ షెడ్యూల్ అయింది. రెండున్నర నెలల పాటు అంటే 74 రోజుల పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించబోతోంది.

ఈ నెల 22వ తేదీన రాత్రి 8 గంటలకు తొలి మ్యాచ్ జరుగనుంది. గత సీజన్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడబోతోంది. ఈ రెండింటికీ ప్రతిష్ఠాత్మకంగా మారిన మ్యాచ్ ఇది. తొలి మ్యాచ్ నుంచే జైత్రయాత్ర మొదలుపెట్టాలనే పట్టుదలతో ఉన్నాయవి. చెన్నైలోని చెపాక్‌లో గల ఎంఏ చిదంబరం స్టేడియం ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది.

IPL 2024 Sandeep Warrier as replacement for Shami and Maphaka for the Dilshan Madushanka

ఈ పరిస్థితుల్లో రెండు కొత్త ముఖాలు ఐపీఎల్ 2024లో కనిపించబోతోన్నాయి. గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ స్క్వాడ్స్‌లో చోటు దక్కించుకున్నాయి. గాయపడ్డ స్టార్ ప్లేయర్ల స్థానంలో ఇద్దరు యంగ్ అండ్ డైనమిక్ ఆటగాళ్లు ఈ ఐపీఎల్ సీజన్‌లో తమ సత్తా చూపించబోతోన్నారు.

ఒకరు- సందీప్ వారియర్. గుజరాత్ టైటాన్స్ తరఫున ఈ ఐపీఎల్‌లో అడుగు పెట్టబోతోన్నాడు. గతంలో కోల్‌కత నైట్ రైడర్స్ తరఫున ఆడిన అనుభవం ఉంది ఈ మలయాళీ రైట్ హ్యాండ్ బ్యాటర్ కమ్ రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్‌కు. 2019, 2020, 2021 సీజన్లల్లో ఆడాడు. అయిదు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఆ తరువాత కనుమరుగు అయ్యాడు.

గాయం కారణంగా గుజరాత్ టైటాన్స్ స్టార్ బౌలర్ మహ్మద్ షమీ ఈ ఐపీఎల్ సీజన్‌ మొత్తానికీ అందుబాటులో లేకపోవడం వల్ల సందీప్ వారియర్‌ను జట్టులోకి తీసుకుందా ఫ్రాంఛైజీ. 50 లక్షల రూపాయలతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. అనూహ్యంగా లభించిన ఈ అవకాశాన్ని అతను ఎలా సద్వినియోగం చేసుకుంటాడనేది ఆసక్తి రేపుతోంది.

రెండో ప్లేయర్- క్వెనా మఫాకా. దక్షిణాఫ్రికా యువ కెరటం. గాయపడ్డ స్టార్ బౌలర్ దిల్షాన్ మధుశంక స్థానంలో మఫాకా ముంబై ఇండియన్స్‌లో చోటు సంపాదించగలిగాడు. ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్‌లో దుమ్ము లేపాడీ లెఫ్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. ప్లేర్ ఆఫ్ ది టోర్నమెంట్‌‌గా నిలిచాడు. జట్టు విజయాల్లో కీలక పాత్రను పోషించాడు. అతన్ని ముంబై ఇండియన్స్ జట్లులోకి తీసుకుంది. 50 లక్షల రూపాయలతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+