వీడియో: అందరి ముందూ కావ్యా పాపను హగ్ చేసుకున్న ఐపీఎల్ స్టార్
Kavya Maran: ఐపీఎల్ 2024 సీజన్‌లో సత్తా చాటింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ప్లేఆఫ్స్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఘనతను సాధించిన మూడో జట్టు ఇదే. కోల్‌కత నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్.. ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరాయి. ఫోర్త్ బెర్త్ ఇంకా ఖాళీగా ఉంది. దీనికోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ కేపిటల్స్ పోటీ పడుతున్నాయి.
శనివారం సాయంత్రం బెంగళూరు వేదికగా చెన్నై సూపర్ కింగ్స్- ఆర్సీబీ మధ్య జరిగే మ్యాచ్.. ప్లేఆఫ్స్ చేరబోయే నాలుగో జట్టును ఖరారు చేస్తుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ గెలిస్తే.. 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఓడితే మాత్రం.. నాలుగో బెర్త్‌ను నెట్ రన్‌రేట్ ఖరారు చేస్తుంది.

గురువారం రాత్రి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్- గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే. భారీ వర్షం వల్ల ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ చెరో పాయింట్ దక్కించుకున్నాయి.
దీనితో సన్‌రైజర్స్ 15 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరింది. లీగ్స్ దశలో తన చివరి మ్యాచ్‌ను ఆదివారం ఆడబోతోంది. ఇదే ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌ను ఎదుర్కొంటుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఇందులో గెలిస్తే పాయింట్ల పట్టికలో రెండో పొజీషన్‌కు ఎగబాకుతుంది సన్‌రైజర్స్.
— SunRisers Hyderabad (@SunRisers) May 16, 2024
ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ రద్దయిన అనంతరం ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ కేన్ విలియమ్సన్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ ఓనర్ కావ్యా మారన్ వీఐపీ బాక్స్‌లో తారసపడ్డారు. కేన్.. అంటూ అతన్ని పిలిచి మరీ పలకరించింది కావ్యా మారన్. హాయ్ కావ్యా హౌ ఆర్ యూ అంటూ ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు కేన్ మామ.
Kane mama of 2018 is what we miss
— Mass Mayanti !!! (@MassMayanti) May 16, 2024
ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇదివరకు కేన్ విలియమ్సన్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యాన్ని వహించిన విషయం తెలిసిందే. నాలుగు సీజన్లకు అతనే కేప్టెన్. కేన్ కేప్టెన్సీలో ఆశించిన స్థాయిలో రాణించలేదు సన్‌రైజర్స్. 2022లో అతన్ని రిలీజ్ చేసింది. గుజరాత్ టైటాన్స్ కేన్‌ను కొనుగోలు చేసింది.
Mama 🧡🤩
— ORANGE ARMY (@SUNRISERSU) May 16, 2024
Aaj toh kavya cutie ki awaj sun Li 🥰
— Vijay (@veejuparmar) May 16, 2024












Click it and Unblock the Notifications