ముంబై ఇండియన్స్ ఓటమికి 3 కారణాలు

GT vs MI: ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కష్టాలు తీరట్లేదు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయిందా జట్టు. అహ్మదాబాద్‌లో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో చిత్తుగా ఓడింది. ఇప్పటివరకు ఆడిన రెండింట్లోనూ ఘోరంగా ఓడింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి దిగజారింది.

మారని కథ..

ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ తీరు ఏ మాత్రం మారలేదు.. మెరుగుపడనూ లేదు. ఓపెనర్లు మరోసారి ఘోరంగా విఫలం అయ్యారు. గెలవడానికి 197 పరుగులు చేయాల్సిన దశలో 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోవడం ఆ జట్టు బ్యాటింగ్ బలహీనతలను బహిర్గతం చేసింది.

IPL 2025 3 Reasons Why Mumbai Indians lost the match against GT

తొలి ఓవర్‌లోనే..

తొలి ఓవర్‌లోనే రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. మహ్మద్ సిరాజ్ వేసిన రిప్పర్‌కు అతని వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఆఫ్ సైడ్ స్టంప్‌కు కాస్త అవతల పిచ్ అయి వికెట్ల మీదికి దూసుకొచ్చిన ఆ బంతిని ఏ మాత్రం అంచనా వేయలేకపోయాడు రోహిత్. బ్యాట్‌ను అడ్డం పెట్టేటప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింద. అండ్ ప్యాడ్ మధ్య దూసుకెళ్లిన ఆ డెలివరీ మిడిల్ స్టంప్ బెయిల్‌ను ఎగురగొట్టింది.

మిడిల్ ఆర్డర్‌పై భారం..

టాప్ ఆర్డర్ విఫలం కావడంతో బ్యాటింగ్ భారం మొత్తాన్ని మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు మోయాల్సి వచ్చింది. సూర్యకుమార్ యాదవ్, హైదరాబాదీ తిలక్ వర్మ.. ఇన్నింగ్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. సూర్యకుమార్ యాదవ్ భారీ ఇన్నింగ్ ఆడాడు. 28 బంతుల్లో 48 పరుగులు చేశాడు. ఇందులో ఒక ఫోర్, నాలుగు భారీ సిక్సర్లు ఉన్నాయి.

స్లో బ్యాటింగ్..

36 బంతులను ఎదుర్కొన్న తిలక్ వర్మ చేసింది 39 పరుగులే. ఇందులో ఒక సిక్సర్, మూడు ఫోర్లు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్‌తో పోటీపడుతూ దూకుడుగా ఆడివుంటే పరిస్థితి ఖచ్చితంగా మరోలా ఉండేదే. ఆ తరువాత వచ్చిన బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడానికి వీలుండేది.

చేతులెత్తేసిన ఆల్ రౌండర్..

లోయర్ ఆర్డర్‌లో ఆదుకుంటాడని భావించిన కేప్టెన్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం చేతులెత్తేయడం ముంబై ఇండియన్స్ ఓటమికి బాటలు వేసినట్టయింది. ఏకంగా 17 బంతులను ఎదుర్కొని అతను చేసిన పరుగులు 11. ఇందులో ఒకే ఒక్క ఫోర్. రాబిన్ మిన్జ్ సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యాడు.

ఈ ఇద్దరు తప్ప..

సూర్యకుమార్ యాదవ్,తిలక్ వర్మ తప్ప మిగిలిన బ్యాటర్లెవరూ రాణించలేదు. ఉన్నంతలో నమన్‌ ధీర్, మిఛెల్ శాంట్నర్ కాస్త భారీ షాట్లకు ప్రయత్నించారు. అప్పటికే ముంబై ఇండియన్స్‌కు ఓటమి ఖరారైంది. వీరిద్దరూ ధాటిగా బ్యాటింగ్ చేసి ఓటమి అంతర్యాన్ని తగ్గించగలిగారంతే.

ముంబై పరిస్థితేంటీ..?

ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు గెలుపు రుచి చూడలేదు. ఆడిన రెండింట్లోనూ పరాజయాలే ఎదురయ్యాయి. తన తదుపరి మ్యాచ్‌లో కోల్‌కత నైట్ రైడర్స్‌తో తలపడనుంది. సోమవారం సాయంత్రం 7:30 గంటలకు ముంబై వాంఖెడె స్టేడియంలో ఈ మ్యాచ్ ఉంటుంది. సొంత గడ్డపై ఆడబోతోండటం ప్లస్ పాయింట్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+