IPL 2025: ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు బాదిన జట్లు ఇవే..!
ఈ ఏడాది క్రికెట్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా అని చెప్పొచ్చు. ఇటీవల దాదాపు 20 రోజులపాటు జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విశ్వ విజేతగా నిలిచింది. ఆ మజా నుంచి బయటకు వచ్చేలోపే ఐపీఎల్- 2025 ప్రారంభం కాబోతోంది. మార్చి 22న కోల్ కతా వేదికగా కేకేఆర్- ఆర్సీబీ మ్యాచ్ తో టోర్నీ ప్రారంభం కానుంది. మార్చి 22 నుంచి మే 25 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. ఐపీఎల్ 2025 మ్యాచ్‌లు దిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, జైపూర్, అహ్మదాబాద్, చండీగఢ్, ధర్మశాల, గువాహటి, విశాఖపట్టణం నగరాల్లో జరగనున్నాయి.
ఐపీఎల్ అంటేనే ఎన్నో రికార్డులు, సంచలన ప్రదర్శనలు, అద్భుత బ్యాటింగ్, అంతకుమించిన బౌలింగ్, ఉత్కంఠబరితమైన ఫీల్డింగ్.. ఇలా చెప్పుకుంటూపోతే ఒక్కటేమిటి.. టాస్ పడిన దగ్గరినుంచి మ్యాచ్ ముగిసే వరకూ ప్రతి సన్నివేశం ఓ కిక్ ఇచ్చే మూమెంట్ లా ఉంటుంది. మరి ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ల్లో ఏ జట్టు అత్యధిక సిక్సర్లు బాదిందో ఇక్కడ తెలుసుకుందాం..

ఐపీఎల్ లో ప్రతి నాలుగైదు బంతులకు ఓ బౌండరీనో, సిక్సరో బాదడం ఇప్పటి సీజన్లో సర్వసాధారణం అయిపోయింది. అయితే ఇప్పటి వరకూ జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్లు ఏవి అంటే తొలి స్థానంలో ముంబై ఇండియన్స్ జట్టు ఉంది. ఈ టీమ్ లోని ప్లేయర్లు ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు 1,681 సిక్సర్లు కొట్టారు.
ఇక రెండో ప్లేస్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఉంది. ఈ టీమ్ ఇప్పటివరకు 1649 సిక్సర్లు బాదింది. ఇక మూడో స్థానంలో పంజాబ్ కింగ్స్ (1513) ఉంది. ఆ తర్వాత వరుసగా చెన్నై సూపర్ కింగ్స్(1508), కేకేఆర్(1492), దిల్లీ క్యాపిటల్స్(1348),రాజస్థాన్(1235), సన్ రైజర్స్ హైదరాబాద్(1038), డెక్కన్ ఛార్జర్స్(400), లక్నో(332), గుజరాత్ టైటాన్స్(270) వరుసగా ఉన్నాయి. అయితే మరో రెండు రోజుల్లో ఐపీఎల్ 2025 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ గణాంకాలు తారుమారు కావొచ్చు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications