IPL 2025 Final : ఈ సాల కప్ నమ్దే.. RCB 18 ఏళ్ల కల నెరవేరింది
IPL 2025 Final : ఐపీఎల్ 2025 లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ బరితమైన ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (43; 35 బంతుల్లో 3×4) పరుగులు, లివింగ్‌స్టన్ (25; 15 బంతుల్లో 2×6), రొమారియో షెఫర్డ్ (17;9 బంతుల్లో 1×4; 1×6) కీలక పరుగులు చేశారు.
పంజాబ్ బౌలర్లలో జెమీషన్, ఆర్ష్ దీప్ సింగ్, చెరో 3 వికెట్లు పడగొట్టారు. అజ్మతుల్లా, యుజ్వేంద్ర చాహల్, విజయ్ కుమార్ తలో వికెట్ తీశారు.

ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా కప్పు కొట్టింది ఆర్సీబీ. ఈ సాల కప్ నమ్దే.. అంటూ ఏళ్లకు ఏళ్లు ఊరించి ఎట్టకేలకు టైటిల్ కైవసం చేసుకుంది. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ 18 ఏళ్ల కలను జట్టు నిజం చేసింది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఫైనల్‌లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది ఆర్సీబీ.
మొదటగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో జోష్ ఇంగ్లిస్ (39; 23 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సులు), ప్రభ్ సిమ్రన్ సింగ్ (26), ప్రియాంశ్ ఆర్య (24), శశాంక్ సింగ్ (22) నేహల్ వధేరా (15) పరుగులు చేశారు. పంజాబ్ కింగ్స్ సారథి, స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరడం మ్యాచ్ టర్నింగ్ పాయింగ్ గా మారింది.
We’re not crying. You are.
— Royal Challengers Bengaluru (@RCBTweets) June 3, 2025
pic.twitter.com/xIjM8lL9zl
ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ 2, కృనాల్ పాండ్య 2, హేజిల్ వుడ్, రొమారియో షెఫర్డ్, యశ్ దయాల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.












Click it and Unblock the Notifications