సంజు శాంసన్‌కు షాక్- సన్‌రైజర్స్‌కు ఖుష్

Sanju Samson: ఇంకో రెండు రోజులే. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ 18వ ఎడిషన్ గుడువు సమీపించింది. శనివారం తొలి మ్యాచ్ జరుగనుంది. 2024లో ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న కోల్‌కత నైట్‌రైడర్స్ టీమ్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీ కొట్టబోతోంది. నైట్‌రైడర్స్ హోమ్ పిచ్‌ ఈడెన్ గార్డెన్స్‌ దీనికి వేదిక.

2008 నాటి తొలి సీజన్ తరువాత ఈ రెండు జట్లు తొలి మ్యాచ్‌లో ఎదురుపడటం ఇదే తొలిసారి. మే 20వ తేదీన తొలి క్వాలిఫయర్ ఉంటుంది. 21వ తేదీన ఎలిమినేటర్, 23వ తేదీన రెండో క్వాలిఫయర్ షెడ్యూల్ అయ్యాయి. ఇక 25వ తేదీన ఫైనల్స్ మ్యాచ్ జరుగుతుంది. క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్‌కు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది.

Sunrisers Hyderabad

సన్‌రైజర్స్ హైదరాబాద్.. తన తొలి మ్యాచ్‌ను మార్చి 23వ తేదీన ఆడనుంది. తన హోమ్‌ పిచ్‌పై రాజస్థాన్ రాయల్స్‌ను ఢీ కొట్టనుంది. 27వ తేదీన లక్నో సూపర్ జెయింట్స్, ఏప్రిల్ 6వ తేదీన గుజరాత్ టైటాన్స్, 12న పంజాబ్ కింగ్స్, 23న ముంబై ఇండియన్స్, మే 5న ఢిల్లీ కేపిటల్స్, 10న కోల్‌కత నైట్ రైడర్స్‌ను ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్‌లన్నీ కూడా ఉప్పల్ స్టేడియంలోనే జరుగుతాయి.

ఈ పరిస్థితుల మధ్య రాజస్థాన్ రాయల్స్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ జట్టు ఆడబోయే మొదటి మూడు మ్యాచ్‌లకు ఆల్ రౌండర్ రియాన్ పరాగ్ కేప్టెన్‌గా వ్యవహరించనున్నాడా జట్టుకు. రెగ్యులర్ కేప్టెన్ సంజు శాంసన్ గాయపడటం వల్ల రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజ్‌మెంట్‌కు ఈ మార్పు చేయాల్సొచ్చింది.

Take a Poll

సంజు శాంసన్ జట్టులోనే ఉంటాడు. అయినప్పటికీ- కేప్టెన్‌గా రియాన్ పరాగ్‌ సెలెక్ట్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సంజు శాంసన్ వికెట్ కీపర్ బ్యాటర్. ఈ మూడు మ్యాచ్‌లకు కూడా అతను ఒక బ్యాటర్‌గా, ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే ఆడే వీలు ఉంది.

ప్రస్తుతం చూపుడు వేలి గాయంతో బాధపడుతున్నాడు సంజు. ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 ఇంటర్నేషనల్స్ సిరీస్ సందర్భంగా శాంసన్ కుడి చూపుడు వేలికి గాయమైంది. దీనికి సర్జరీ చేసుకోవాల్సొచ్చింది. ఇందులో నుంచి అతను ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్నాడు. వేలి గాయంతో వికెట్ కీపర్‌గా వ్యవహరించడం కష్టం.

Riyan Parag

అందుకే ఇంప్టాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే కొనసాగించాలని నిర్ణయించింది. అవసరమైన సమయంలో బ్యాటింగ్‌కూ దిగొచ్చు. తొలి మూడు మ్యాచ్‌ల తరువాత ఈ వేలి గాయం నుంచి పూర్తిగా కోలుకోగలిగితే మళ్లీ కేప్టెన్సీ పగ్గాలను అందుకుంటాడు.

ఈ నెల 23వ తేదీన ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢీ కొట్టనుంది రాజస్థాన్ రాయల్స్. 26న తన మలి మ్యాచ్‌లో కోల్‌కత నైట్ రైడర్స్, ఆ తరువాత 30వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడాల్సి ఉంది. ఈ మూడు కూడా బలమైన జట్లేననడంలో సందేహాలు అక్కర్లేదు. రియాన్ పరాగ్ కేప్టెన్సీ కెపాసిటీ ఎలా ఉంటుందనేది దీనితో తేలిపోతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+