ఐపీఎల్ 2025 షెడ్యూల్ విడుదల: మార్క్ ద డేట్స్ మచ్చా
IPL 2025 schedule: ఎంతగానో ఎదురు చూస్తూ వస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ 18వ ఎడిషన్ పూర్తి షెడ్యూల్ విడుదలైంది. మార్చి 22వ తేదీన తొలి మ్యాచ్ జరుగనుంది. 2024లో ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న కోల్‌కత నైట్ రైడర్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీ కొట్టనుంది. నైట్‌రైడర్స్ హోమ్ పిచ్ ఈడెన్ గార్డెన్స్ దీనికి వేదిక.
2008 నాటి తొలి సీజన్ తరువాత ఈ రెండు జట్లు తొలి మ్యాచ్‌లో ఎదురుపడటం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మే 20వ తేదీన తొలి క్వాలిఫయర్ ఉంటుంది. 21వ తేదీన ఎలిమినేటర్, 23వ తేదీన రెండో క్వాలిఫయర్ షెడ్యూల్ అయ్యాయి. ఇక 25వ తేదీన ఫైనల్స్ మ్యాచ్ జరుగుతుంది. క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్‌కు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదిక.

మార్చి 23వ తేదీన అంటే రెండో రోజున తన తొలి మ్యాచ్ ఆడబోతోంది చెన్నై సూపర్ కింగ్స్. ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టనుంది. మళ్లీ మే 20వ తేదీన ఈ రెండు జట్లూ మరోసారి తలపడతాయి. మార్చి 8వ తేదీన చెపాక్ చిదంబరం స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది సీఎస్‌కే. మళ్లీ మే 3వ తేదీన ఈ రెండు జట్లూ ఢీ కొడతాయి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో.
ఏప్రిల్ 5న ఢిల్లీ కేపిటల్స్, 11న కోల్‌కత నైట్‌రైడర్స్, 25న సన్‌రైజర్స్ హైదరాబాద్, 30న పంజాబ్ కింగ్స్, మే 12న రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతుంది సీఎస్‌కే. లీగ్ దశలో ముంబై ఇండియన్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఒకే ఒక్క జరుగనుంది. ఏప్రిల్ 7వ తేదీన వాంఖెడే స్టేడియంలో ఈ రెండు జట్ల తలపడతాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్.. తన తొలి మ్యాచ్‌ను మార్చి 23వ తేదీన ఆడనుంది. తన హోమ్ పిచ్‌పై రాజస్థాన్ రాయల్స్‌ను ఢీ కొట్టనుంది. 27వ తేదీన లక్నో సూపర్ జెయింట్స్, ఏప్రిల్ 6వ తేదీన గుజరాత్ టైటాన్స్, 12న పంజాబ్ కింగ్స్, 23న ముంబై ఇండియన్స్, మే 5న ఢిల్లీ కేపిటల్స్, 10న కోల్‌కత నైట్ రైడర్స్‌ను ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్‌లన్నీ కూడా ఉప్పల్ స్టేడియంలోనే జరుగుతాయి.












Click it and Unblock the Notifications