ఊపిరి బిగబట్టుకోండి బ్రదర్: ఐపీఎల్ 2025 కంప్లీట్ షెడ్యూల్- ఫ్రీగా చూడాలంటే..
IPL 2025 schedule: మచ్ అవైటెడ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ బిగ్ అప్‌డేట్. ఐపీఎల్ 2025 షెడ్యూల్ ఇంకాస్సేపట్లో వెలువడబోతోంది. ఇది 18వ ఎడిషన్. ఈ సాయంత్రం 5:30 గంటలకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఈ షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. దీనికోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
మార్చి 22వ తేదీన తొలి మ్యాచ్ షెడ్యూల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ గేమ్‌లో- 2024లో ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న కోల్‌కత నైట్ రైడర్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీ కొట్టొచ్చు. ఈ సీజన్‌లో కూడా తన హోమ్ పిచ్ ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ ఈ సీజన్ ఐపీఎల్ ఛాంపియన్‌షిప్ టైటిల్ వేట మొదలు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

గత ఏడాది తరహాలోనే ఈ సీజన్ కూడా రెండున్నర నెలల పాటు కొనసాగుతుందని భావిస్తోన్నారు. 74 మ్యాచ్‌లు జరగొచ్చు. మే 25వ తేదీన ఫైనల్ మ్యాచ్.. ఉండచ్చని తెలుస్తోంది. ఈడెన్ గార్డెన్స్, చెన్నై చెపాక్ లేదా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలల్లో ఫైనల్స్ షెడ్యూల్ అవుతుందని అంటున్నారు. రెండు ప్లేఆఫ్ మ్యాచ్‌లకు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వొచ్చు.
జియో హాట్‌స్టార్.. ఐపీఎల్ 2025 షెడ్యూల్ విడుదల ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. దీన్ని ఉచితంగా చూడొచ్చు. దీనితో పాటు స్టార్ స్పోర్ట్స్1, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 2, స్పోర్ట్స్ 18.. ఈ ప్రెస్ మీట్‌ను లైవ్ టెలికాస్ట్ చేయనున్నాయి. దాదాపుగా అన్ని ఫ్రాంఛైజీల ప్రతినిధులు దీనికి హాజరవుతారని సమాచారం.
ఐపీఎల్ షెడ్యూల్ విడుదల కాబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ రెండు జట్లు ఇంకా తమ కేప్టెన్‌ను ప్రకటించాల్సి ఉంది. ఢిల్లీ కేపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంఛైజీలు ఈ సీజన్ కోసం తమ కెప్టెన్లను ప్రకటించడంలో జాప్యం చేస్తోన్నాయి. కేకేఆర్ కేప్టెన్సీ కోసం అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్ రేసులో ఉన్నారు. ఢిల్లీ కేపిటల్స్ కోసం అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ మధ్య పోటీ ఉంటోంది.












Click it and Unblock the Notifications