SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్
ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. శనివారం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. చెత్త బౌలింగ్‌తో పాటు హెన్రీచ్ క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయవకాశాలను దెబ్బతీసింది. 220 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ కాపాడుకోలేకపోయింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ(28 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 74) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగగా.. ట్రావిస్ హెడ్(23 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 38) దూకుడుగా ఆడాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, శశాంక్ సింగ్ రెండేసి వికెట్లు తీయగా.. జేవియర్ బార్ట్‌లెట్‌కు ఒక వికెట్ దక్కింది.

అనంతరం పంజాబ్ కింగ్స్ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 223 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య(20 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 57), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51), శ్రేయస్ అయ్యర్(33 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో69 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో శివాంగ్ కుమార్(3/33) ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టగా.. హర్ష్‌దూబే ఒక వికెట్ తీసాడు.
కొంపముంచిన క్లాసెన్ జిడ్డూ బ్యాటింగ్..
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ సందర్భంగా హెన్రీచ్ క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్‌తో జట్టుకు నష్టం చేశాడు. 33 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 39 పరుగులే చేశాడు. దాంతో 250 ప్లస్ రన్స్ చేస్తుందనకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ 219 పరుగులకే పరిమితమైంది. అతని జిడ్డు బ్యాటింగ్ కారణంగా స్లాగ్ ఓవర్లలో సన్‌రైజర్స్ 37 పరుగులే చేసింది. క్లాసెన్ కాస్త దూకుడుగా ఆడి ఉంటే జట్టు లక్ష్యానికి 20-30 పరుగుల అదనంగా జతయ్యేవి. అప్పుడు సన్‌రైజర్స్ గెలిచే అవకాశం ఉండేది.
చెత్త బౌలింగ్..
క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్‌కు తోడు బౌలర్ల వైఫల్యం సన్‌రైజర్స్ పతనాన్ని శాసించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో శివాంగ్ కుమార్, హర్ష్‌దూబే మినహా మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా హర్షల్ పటేల్(0/39), జయదేవ్ ఉనాద్కత్(0/40), ఎషాన్ మలింగా(0/46) వైఫల్యం సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయవకాశాలను దెబ్బతీసింది.
ప్రఫుల్ హింగే అరంగేట్రం చేస్తున్నాడని చెప్పిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. అనూహ్యంగా అతని స్థానంలో జయదేవ్ ఉనాద్కత్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించింది. కానీ ఈ వ్యూహం బెడిసికొట్టింది. ఉనాద్కత్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ప్రఫుల్ హింగేను ఆడించినా పరిస్థితి మరోలా ఉండేదేమో. హర్షల్ పటేల్ అయితే ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. దాంతో 220 పరుగుల భారీ లక్ష్యం కూడా పంజాబ్ కింగ్స్ ముందు చిన్నబోయింది. ఈ బలహీనమైన బౌలింగ్‌తో సన్‌రైజర్స్ ఈ టోర్నీలో రాణించడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
-
అరె ఓ సాంబా.. ఇంకో రెండు పాయింట్లు ఇచ్చుకో -
బుడ్డోడి ఈ అతి దూకుడు మునిగిపోవడానికేనా? -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
అందరి నోళ్లూ ముయించాడు గానీ.. -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
రోహిత్, శార్దూల్ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు: చిన్ననాటి కోచ్ వీడియో -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
గిదేం ఆట సామీ?: నువ్వు తోపువనుకుంటే తుస్సుమన్నావ్ కదా! -
DC vs GT: ఢిల్లీ-గుజరాత్ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందా ? ఆ రెండు బాల్స్ ..! -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..?












Click it and Unblock the Notifications