బుడ్డోడా జాగ్రత్త.. ఈ సారి బౌలర్లు నిన్ను వదలరు!

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే క్రికెట్ ప్రపంచంలో చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా గత సీజన్‌లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచిన 14 ఏళ్ల యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ యువ ప్లేయర్‌కు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ సీజన్ వైభవ్ సూర్యవంశీకి ఓ పెద్ద సవాలుగా మారనుందని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు.

సర్‌ప్రైజ్ ప్యాకేజీ రోజులు ముగిశాయి!
ఇర్ఫాన్ పఠాన్ విశ్లేషణ ప్రకారం.. "గత సీజన్లో వైభవ్ సూర్యవంశీ గురించి ప్రత్యర్థి జట్లకు సరైన అవగాహన లేదు. అందుకే వైభవ్ ఓ సర్‌ప్రైజ్ ప్యాకేజీలా చెలరేగిపోయి భారీ స్కోర్లు సాధించగలిగాడు. కానీ ఈ సారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండబోతోంది. ప్రస్తుతం ప్రతి జట్టు వద్ద అత్యాధునిక విశ్లేషణా సాధనాలు ఉన్నాయని.. బౌలర్లు ఇప్పటికే వైభవ్ బ్యాటింగ్ వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించి ఉంటారు. వైభవ్ బలాలు, బలహీనతలు ఇప్పుడు అందరికీ తెలుసని.. కాబట్టి ప్రతి బౌలర్ అతడిని కట్టడి చేయడానికి పక్కా ప్లాన్ తో సిద్ధంగా ఉంటారు." అని ఇర్ఫాన్ పఠాన్ హెచ్చరించాడు.

IPL 2026 Irfan Pathan Warns RR Star Vaibhav Suryavanshi Challenges Ahead for the Young Prodigy

వైభవ్ సూర్యవంశీ రికార్డుల ప్రస్థానం
గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్ వైభవ్ సూర్యవంశీని రూ.1.10 కోట్లకు కొనుగోలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే వైభవ్ అడుగుపెట్టడమే రికార్డులతో మొదలుపెట్టాడు. గుజరాత్ టైటాన్స్ జట్టుపై కేవలం 35 బంతుల్లోనే శతకం బాది ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయస్సులోనే సెంచరీ బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత కూడా వైభవ్ జోరు తగ్గలేదు. అండర్-19 ప్రపంచ కప్ 2026 ఫైనల్లో 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి భారత్‌ను గెలిపించాడు. టోర్నమెంట్ అంతటా 439 పరుగులతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

అసలైన ఛాలెంజ్ ఇప్పుడే..
ఒక సీజన్లో మెరుపులు మెరిపించడం కంటే.. వచ్చిన గుర్తింపును నిలబెట్టుకోవడమే గొప్ప ఆటగాడి అసలైన లక్షణమని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ ముందున్న అతిపెద్ద ఛాలెంజ్ ఏమిటంటే.. తన బ్యాటింగ్ టెక్నిక్‌ను మరింత మెరుగుపరుచుకోవడం. బౌలర్లు అతన్ని టార్గెట్ చేస్తున్నప్పుడు, ఒత్తిడిని అధిగమించి నిలకడగా పరుగులు సాధించడంపైనే అతని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ సీజన్ వైభవ్ ఒక సాధారణ ఆటగాడిగా మిగిలిపోతాడా లేదా "నెక్స్ట్ లెవల్" స్టార్‌గా ఎదుగుతాడా అనేది నిర్ణయిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మద్దతు ఇచ్చిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్
వైభవ్ సూర్యవంశీపై విమర్శలు, విశ్లేషణలు పెరుగుతున్న తరుణంలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ అతడికి అండగా నిలిచాడు. "వైభవ్ ఇంకా చిన్న పిల్లాడు. అతడిని ప్రశాంతంగా ఆడనివ్వండి" అంటూ వైభవ్ సూర్యవంశీపై అతిగా ఒత్తిడి పెంచవద్దని రియాన్ పరాగ్ కోరాడు. జట్టు యాజమాన్యం కూడా వైభవ్‌పై పూర్తి నమ్మకంతో ఉంది. మార్చిలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026లో ఈ యువ వండర్ కిడ్ తన సత్తా చాటి పఠాన్ వంటి దిగ్గజాల ప్రశంసలు అందుకుంటాడో లేదో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+