IPL 2026: పంజాబ్ కొంపముంచిన వరుణుడు.. బచాయించిన కేకేఆర్!

ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న పంజాబ్ కింగ్స్‌కు వరుణుడు కళ్లెం వేసాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరగాల్సిన పంజాబ్‌ మ్యాచ్‌ను మింగేసాడు. దాంతో గెలవాల్సిన 2 మ్యాచ్‌ పాయింట్లు పంజాబ్ కింగ్స్.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పంచుకోవాల్సి వచ్చింది.‌

ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించినప్పుడే పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఆకాశం వైపు చూస్తూ.. గట్టిగా అరిచాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 'ఓరి దేవుడా..మాకు మాత్రమే ఎందుకు ఇలా'అని అడిగినట్లు ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాడు.

ఎడతెరిపి లేని వర్షం కారణంగా మ్యాచ్ మొత్తం చిత్తడిగా మారడంతో కటాఫ్ సమయం వరకు వేచి చూసిన అంపైర్లు చివరకు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఇక మ్యాచ్ ఆగిపోయే సమయానికి కేకేఆర్ 3.4 ఓవర్లలో 25 పరుగులు చేసింది.

IPL 2026 Rain Plays Spoilsport as PBKS Denied Victory Chance Against KKR Xavier Bartlett s Heroics Go in Vain

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు పంజాబ్ కింగ్స్ జేవియర్ బార్ట్‌లెట్ దిమ్మతిరిగే షాకిచ్చాడు. రెండో ఓవర్‌లోనే ఫిన్ ‌అలెన్, కామెరూన్ గ్రీన్‌లను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. 3 బంతుల్లోనే రెండు వికెట్లు తీసిన పంజాబ్ ఈ మ్యాచ్‌‌పై గట్టి పట్టు సాధించింది. ఈ క్రమంలోనే మ్యాచ్ పూర్తిగా జరిగినా.. ఐదు ఓవర్ల ఆట నిర్వహించినా పంజాబ్ గెలిచేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఏది ఏమైనా ఈ మ్యాచ్ కారణంగా కేకేఆర్ ఖాతాలో అప్పనంగా ఒక పాయింట్ వచ్చి చేరిందని ఫ్యాన్స్ సెటైర్లు పేల్చుతున్నారు. గత రెండు మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడిన కేకేఆర్.. తాజా మ్యాచ్ రద్దవ్వడంతో పాయింట్స్ టేబుల్‌లో ఒక స్థానం ఎగబాకి 8వ స్థానంలో నిలిచింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

యాదృశ్చికమో ఏమో కానీ గతేడాది కూడా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా వర్షంతో తుడుచుకుపెట్టుకుపోయింది. ఆ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ పూర్తవ్వగా.. కేకేఆర్ ఇన్నింగ్స్ సందర్భంగా వర్షం అంతరాయం కలిగించింది. కానీ తాజా మ్యాచ్‌లో 36.2 ఓవర్ల ఆటను వరణుడు మింగేసాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+