IPL 2026: క్యాచ్ కాదు.. మ్యాచే పోయింది! (వీడియో)
'క్యాచెస్ విన్ మ్యాచెస్' నానుడీని తాజాగా జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్ మరోసారి రుజువు చేసింది. ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన లోస్కోర్ థ్రిల్లర్‌లో రాజస్థాన్ రాయల్స్ ఫీల్డర్ నండ్రే బర్గర్ చేసిన తప్పిదం ఆ జట్టు ఓటమిని శాసించింది. కేకేఆర్ డేంజరస్ బ్యాటర్ రింకూ సింగ్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను నండ్రే బర్గర్ నేలపాలు చేయడంతో రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
8 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద లభించిన లైఫ్‌తో రింకూ సింగ్ చెలరేగాడు. ఏకంగా అజేయ హాఫ్ సెంచరీతో రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించాడు. దాంతో ఈ సీజన్‌లో ఐదు పరాజయాల తర్వాత కేకేఆర్ తొలి విజయాన్ని నమోదు చేసింది. కేకేఆర్ విజయం నేపథ్యంలో బర్గర్ క్యాచ్ డ్రాప్ తీవ్ర చర్చనీయాంశమైంది.
రింకూ సింగ్ అజేయ హాఫ్ సెంచరీ..
156 పరుగుల లక్ష్య ఛేదనలో కేకేఆర్ 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగుల చేసి గెలుపొందింది. రింకూ సింగ్(34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. అనుకుల్ రాయ్(16 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 27 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కామెరూన్ గ్రీన్(13 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 27), రోవ్‌మన్ పోవెల్(20 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 23) పర్వాలేదనిపించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో రవీంద్ర జడేజా(2/8) రెండు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, నండ్రే బర్గర్, రవి బిష్ణోయ్ యశ్ రాజ్ పుంజా తలో వికెట్ తీసారు.

అంతకుముందు రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులే చేసింది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ(28 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46), యశస్వి జైస్వాల్(29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39) మినహా మరే బ్యాటర్ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. కేకేఆర్ బౌలర్లలో కార్తీక్ త్యాగీ(3/22), వరుణ్ చక్రవర్తీ(3/14) మూడేసి వికెట్లు తీయగా.. సునీల్ నరైన్(2/26) రెండు వికెట్లు పడగొట్టాడు.
మలుపుతిప్పిన భాగస్వామ్యం..
156 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో కేకేఆర్ తీవ్రంగా ఇబ్బంది పడింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల ధాటికి 85 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగింది. కానీ రింకూ సింగ్, అనుకూల్ రాయ్(16 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 29 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో కేకేఆర్‌కు అద్భుతమైన విజయాన్ని అందించారు. 35 బంతుల్లో 76 పరుగుల అజేయ భాగస్వామ్యంతో రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించారు.
జోఫ్రా ఆర్చర్ వేసిన 19వ ఓవర్‌లో అనుకుల్ రాయ్ భారీ సిక్సర్ బాది మ్యాచ్‌ను కేకేఆర్ వైపు మలుపు తిప్పాడు. ఆఖరి ఓవర్‌లో కేకేఆర్ విజయానికి 9 పరుగులు అవసరం కాగా.. రింకూ సింగ్ వరుసగా రెండు బౌండరీలు, సిక్సర్‌తో బాది మ్యాచ్‌ను ముగించడంతో పాటు ఈ సీజన్‌లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
Nandre Burger drops a sitter ! Jadeja can't beleive it !
— Cricket IQ (@S17Anurag) April 19, 2026
Will it cost RR , Right now RR in the lead !
KKR hoping for a miracle by Rinku, Anukul and Narine!#KKRvsRR #KKRvRR #IPL2026pic.twitter.com/GlRI9R2w1u
కొంపముంచిన బర్గర్..
రవీంద్ర జడేజా వేసిన 11వ ఓవర్‌లో 8 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రింకూ సింగ్ ఔటవ్వాల్సింది. కానీ బర్గర్ తప్పిదంతో బచాయించిన రింకూ మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. ఈ ఓవర్ ఆఖరి బంతిని జడేజా ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. రింకూ సింగ్ స్వీప్ షాట్ ఆడబోయాడు. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి షార్ట్ థర్డ్ మ్యాన్ వైపు గాల్లోకి లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న బర్గర్ క్యాచ్ అందుకోలేకపోయాడు.












Click it and Unblock the Notifications