IPL 2026: కేకేఆర్‌ను ముంచిన వరుణ్ చక్రవర్తీ.. CSK గ్రాండ్ విక్టరీ!
ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. చెన్నై వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన చెన్నై సూపర్ కింగ్స్ 32 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. మరోసారి పేలవ బౌలింగ్, చెత్త బ్యాటింగ్‌తో కేకేఆర్ మూల్యం చెల్లించుకుంది.
193 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 160 పరుగులే చేసి ఓటమిపాలైంది. రోవ్‌మన్ పోవెల్(22 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 31 నాటౌట్), రమణ్‌దీప్ సింగ్(23 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 35) పోరాడినా ఫలితం లేకపోయింది.
కెప్టెన్ అంజింక్యా రహానే(28), సునీల్ నరైన్(24), అంగ్‌క్రిష్ రఘువంశీ(27) నిరాశపర్చారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్(3/21) మూడు వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, అకీల్ హోస్సెన్ తలో వికెట్ తీసారు.
చెలరేగిన సంజూ
అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది. సంజూ శాంసన్(32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48), డెవాల్డ్ బ్రెవిస్(29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41), ఆయుష్ మాత్రే(17 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
కేకేఆర్ బౌలర్లలో కార్తీక్ త్యాగి(2/35) రెండు వికెట్లు తీయగా.. అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా తలో వికెట్ తీసారు. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్.. ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో కేకేఆర్ పాయింట్ల ఖాతా తెరిచింది.

కొంపముంచిన వరుణ్ చక్రవర్తీ
మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ వైఫల్యం కేకేఆర్ విజయవకాశాలను దెబ్బతీసింది. గాయం నుంచి కోలుకొని ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చిన వరుణ్ తన వైఫల్యాన్ని కొనసాగించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 నుంచి తన పేలవ ప్రదర్శనను వరుణ్ కొనసాగిస్తున్నాడు. తాజా మ్యాచ్‌లో పిచ్ స్పిన్‌కు అనుకూలించింది. అయినా వరుణ్ ఒక్క వికెట్ తీయకపోగా.. 8.66 ఎకానమీతో 26 పరుగులు సమర్పించుకున్నాడు. అతను కాస్త మెరుగ్గా బౌలింగ్ చేసి వికెట్లు తీసి ఉంటే సీఎస్‌కే తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యేది. అప్పుడు ఆ జట్టు గెలిచే అవకాశం ఉండేది.
మరోవైపు సునీల్ నరైన్(1/21)తో పాటు సీఎస్‌కే స్పిన్నర్ నూర్ అహ్మద్(3/21) అద్భుత ప్రదర్శన కనబర్చాడు. నూర్ అహ్మద్ తన మూడు వికెట్లతో కేకేఆర్ పతనాన్ని శాసించాడు. అంజిక్యా రహానే(28)తో పాటు రింకూ సింగ్(6), కామెరూన్ గ్రీన్(0)ను పెవిలియన్ చేర్చి మ్యాచ్‌ను సీఎస్‌కే వైపు మలుపు తిప్పాడు.
ఆ తర్వాత వచ్చిన రోవ్‌మన్ పోవెల్, రమణ్‌దీప్ సింగ్ పోరాడినా ఫలితం లేకపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో పిచ్ కూడా స్లోగా మారినట్లు అనిపించింది. అజింక్యా రహానే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం కూడా కేకేఆర్‌ను దెబ్బతీసింది.
-
ధురందర్ 2 కంటే లాంగ్ మ్యాచ్! ఐపీఎల్లో సరికొత్త రికార్డు -
కృనాల్ పాండ్యా విసిరేసే బంతులను ముంబై బ్యాటర్లు ఎలా ఫేస్ చేస్తారో..!! -
Praful Hinge: బుడ్డోడినే గోల్డెన్ డకౌట్ చేసాడు.. ఎవరీ SRH నయా పేసర్..? -
హార్దిక్ అవుట్ తో కృనాల్ వైల్డ్ సెలబ్రేషన్స్- ఆ వివాదమే అసలు కారణమా..!? -
బుడ్డోడి వికెట్ కోసం పెద్ద ప్లానే చేశా-ముందే చెప్పి మరీ..! ప్రఫుల్ హింగే షాకింగ్..! -
ఆర్ఆర్ నరాలు తెంచారు -
సరైనోళ్లు తగిలితే బుడ్డోడి డొల్లతనం బయటపడుతుంది.!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
Jasprit Bumrah:బుమ్రాకు ఏమైంది..ఆందోళనలో ఫ్యాన్స్..!! -
ఎంత సీఎం అయినా.. !! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
ట్రాక్ ఎక్కేశాడు- కాచుకోండి ఇక












Click it and Unblock the Notifications