MI vs RCB: ముంబై మునుగుతుందా..నిలుస్తుందా: ఆర్సీబీతో హై ఓల్టేజ్ మ్యాచ్..!

MI vs RCB:ముంబై: ఐపీఎల్ 2025 లో భాగంగా సోమవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్రస్థానం ఆశించినంత సాఫీగా సాగలేదు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే అందుకొని పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి పరిమితమైంది. చివరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో స్వల్ప తేడాతో (12 పరుగులు) ఓటమి చవిచూసింది. దీంతో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి తిరిగి విజయాల పట్టాలెక్కాలని పట్టుదలగా ఉంది. అయితే, గత మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ గాయపడటం జట్టుకు కాస్త ఆందోళన కలిగించే అంశం. ఈ కీలక ఆటగాడి ఫిట్‌నెస్‌పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.నెట్స్‌లో రోహిత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తే అతని లభ్యతపై ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది.

RCB ఇంట్లో పిల్లి..బయట పులి
మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టోర్నీని ఘనంగా ప్రారంభించింది. కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్‌పై వరుస విజయాలు సాధించి జోరుమీదుంది. కానీ, సొంత మైదానంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం చతికిల పడింది. 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. రజత్ పటీదార్ నాయకత్వంలోని బెంగళూరు జట్టు ముంబైతో జరిగే మ్యాచ్‌లో గెలిచి మళ్లీ విజయాల బాటలో పడాలని ఉవ్విళ్లూరుతోంది.

ipl-action-heats-up-at-wankhede-mi-vs-rcb-match-preview-and-predictions

వాంఖడే పిచ్ రిపోర్ట్: బ్యాటర్లకు స్వర్గధామం!
వాంఖడే స్టేడియం పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, కొత్త బంతితో పేసర్లు విజృంభించే అవకాశం ఉంది. ఓపెనర్లు ఆచితూచి ఆడితే భారీ స్కోర్లు ఖాయం. ఇక్కడ బౌండరీలు చిన్నగా ఉండటం, అవుట్‌ఫీల్డ్ వేగంగా ఉండటం బ్యాటర్లకు కలిసొచ్చే అంశాలు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు వాంఖడేలో జరిగిన 119 మ్యాచ్‌ల్లో సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 171 పరుగులుగా నమోదైంది. ఛేజింగ్‌కు దిగిన జట్లు 65 సార్లు విజయం సాధించగా, మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 53 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. దీంతో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

హెడ్-టూ-హెడ్ రికార్డు:
ముంబై ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు మొత్తం 33 మ్యాచుల్లో తలపడగా అందులో 19 మ్యాచుల్లో ముంబై గెలిచింది. 14 మ్యాచుల్లో RCB విజయం సాధించింది. 2008 ఏప్రిల్ 20వ తేదీన తొలిసారిగా ఈ రెండు జట్లు తలపడగా.. చివరిసారిగా 2024 ఏప్రిల్ 11వ తేదీన తలపడ్డాయి.ఇక 2025 ఏప్రిల్ 7న (సోమవారం) రెండు జట్లు తలపడతాయి.

తుది జట్లు (అంచనా):

  • ముంబై ఇండియన్స్ (MI): విల్ జాక్స్, ర్యాన్ రిকেলటన్ (వికెట్ కీపర్), నమన్ ధిర్, సూర్యకుమార్ యాదవ్, రాజ్ బావా, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, అశ్విని కుమార్, విఘ్నేష్ పుతూర్.

ఇంపాక్ట్ ప్లేయర్: తిలక్ వర్మ

  • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB): ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యష్ దయాల్.

ఇంపాక్ట్ ప్లేయర్: రసిఖ్ సలామ్

ఫిల్ సాల్ట్ VS ట్రెంట్ బౌల్ట్
ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న ఫిల్ సాల్ట్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఫిల్ సాల్ట్ 31 బంతుల్లో 56 పరుగులు చేయగా.. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 బంతుల్లో 32 పరుగులు పిండాడు. ముంబైకి చెందిన ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్‌లను ఎదుర్కోవడం సాల్ట్‌కు సవాలుతో కూడుకున్న పనే అని చెప్పొచ్చు. తొలి ఓవర్లలో కొత్త బంతి స్వింగ్ కావడం తథ్యంగా కనిపిస్తోంది.ఈ ముంబై వెటరన్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటే ఆర్సీబీ భారీ స్కోరు చేసే అవకాశం ఉంది.

ముంబై ఇండియన్స్ తరపున ట్రెంట్ బౌల్ట్ కొత్త బంతితో చెలరేగే అవకాశాలున్నాయి. పవర్ ప్లేలోనే రెండు మూడు వికెట్లు కనుక ట్రెంట్ బౌల్ట్ తీస్తే ఆర్సీబీ చిక్కుల్లో పడుతుంది. అయితే బౌల్ట్ సంధించే బంతులను విరాట్ కోహ్లీ ఎలా అటాక్ చేస్తారనేది ఆసక్తికరమైన అంశం. బౌల్ట్ వికెట్లు సాధించడంలో సక్సెస్ అయితే గనుక హార్థిక్ పాండ్యకు పెద్ద రిలీఫ్ లభిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+