కావ్యా పాపకు అగ్నిపరీక్ష: రెడీ అవుతున్న మీమ్స్.. !!
Kavya Maran: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్ కోసం మెగా ఆక్షన్ (IPL 2024 auction) మొదలైంది. దుబాయ్ వేదిక ఈ మధ్యాహ్నం ఒంటిగంటకు వేలం ఆరంభమైంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, జియో సినిమా దీన్ని స్ట్రీమింగ్ చేస్తోన్నాయి. ఫ్రాంఛైజీలు ఎలాంటి ప్లేయర్లను తీసుకుంటాయనేది ఉత్కంఠతను రేకెత్తిస్తోంది.
మెగా వేలం పాట కోసం మొత్తంగా 333 మంది ప్లేయర్లు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. క్రికెట్ ఆడే అన్ని జట్లకు చెందిన స్టార్ ప్లేయర్లందరూ ఈ జాబితాలో ఉన్నారు. వీరిలో 214 మంది భారత్, 119 మంది విదేశీ ప్లేయర్లు. 116 మంది క్యాప్డ్, 215 మంది అన్ క్యాప్డ్ ఉన్నారు.

హ్యారీ బ్రూక్, ట్రవిస్ హెడ్, మిఛెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, కరుణ్ నాయర్, మనీష్ పాండే, రౌమన్ పావెల్, స్టీవ్ స్మిత్, పాట్ కమ్మిన్స్, వనిందు హసరంగ, రచిన్ రవీంద్ర, కేఎస్ భరత్, కుషాల్ మెండిస్, ట్రిస్టన్ స్టబ్స్, లోకీ ఫెర్గూసన్, అల్జారీ జోసెఫ్, దిల్షాన్ మదుశంక.. వంటి స్టార్ ప్లేయర్లందరూ తమ అదృష్ణాన్ని పరీక్షించుకోనున్నారు.
ముుంబై ఇండియన్స్ తరఫున ఆకాష్ అంబానీ అటెండ్ అయ్యారు. రికీ పాంటింగ్, రిషభ్ పంత్- ఢిల్లీ కేపిటల్స్, గౌతం గంభీర్- కోల్‌కత నైట్ రైడర్స్, మైక్ హెస్సెన్, ఆండీఫ్లవర్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కావ్యామారన్, డేనియల్ వెటోరీ- సన్‌రైజర్స్ హైదరాబాద్ పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు కావ్యామారన్.
ప్రస్తుతం అందరి కళ్లూ సన్‌రైజర్స్ హైదరాబాద్ మీదే నిలిచాయి. సాధారణంగా బౌలర్లు, ఆల్‌రౌండర్లతో జట్టును నింపడానికి ప్రయత్నిస్తుంటుంది సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్. ఇప్పుడు ఎలాంటి ప్లేయర్లను జట్టులోకి తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది. బ్యాటర్లను జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ ఉంది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications