IPL Auction 2024: సెల్ ఫోన్‌లో ఎలా చూడొచ్చు?: టైమింగ్స్ ఏంటీ? బ్యాలెన్స్ అమౌంట్ ఎంత?

ఐపీఎల్ 2024 వేలం : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్ సమీపించింది. ఈ మెగా టోర్నమెంట్ ఆరంభం కావడానికి ఎంతో సమయం లేదు. ఇంకో రెండు నెలల్లో ఐపీఎల్ 2024 (IPL 2024) ఆరంభం కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి/మార్చి నెలల్లో ఐపీఎల్ 2024 సీజన్‌లో మొత్తం 10 జట్లు పోరాడనున్నాయి.

ఎన్ని రోజులు?

రెండున్నర నెలల పాటు అంటే 74 రోజుల పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే బిగ్గెస్ట్ టోర్నమెంట్ ఇది. దీని కోసం ఇప్పటి నుంచే సన్నాహకాలు సాగుతున్నాయి. అన్ని ఫ్రాంఛైజీలు తమ జట్లను సరికొత్తగా రూపుదిద్దుతున్నాయి. గెలుపు గుర్రాలను జట్టులోకి తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తోన్నాయి.

వెన్యూ ఎక్కడ?

ఈ నెల 19వ తేదీన ఐపీఎల్ 2024 మెగా ఆక్షన్ (IPL 2024 auction) జరుగనుంది. దుబాయ్ దీనికి వేదిక. మధ్యాహ్నం ఒంటిగంటకు వేలం ఆరంభమౌతుంది. ఇందులో పాల్గొనడానికి ఇప్పటికే కొన్ని ఫ్రాంఛైజీల ప్రతినిధులు దుబాయ్‌కు బయలుదేరి వెళ్లారు. రేపు ఉదయానికి అన్ని ఫ్రాంఛైజీల ఓనర్లు దుబాయ్‌లో ల్యాండ్ కానున్నారు.

IPL Auction 2024: Start date and time, purse left and other deets inside

ఎలా చూడొచ్చు?

స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. భారత్‌లో జియో సినిమా దీన్ని స్ట్రీమింగ్ చేయనుంది. ఈ రెండు ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఐపీఎల్ 2024 మెగా ఆక్షన్ కార్యక్రమాన్ని చివరి వరకూ తిలకించవచ్చు.

ఎంతమంది ప్లేయర్లు?

మెగా వేలం పాట కోసం మొత్తంగా 333 మంది ప్లేయర్లు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. క్రికెట్ ఆడే అన్ని జట్లకు చెందిన స్టార్ ప్లేయర్లందరూ ఈ జాబితాలో ఉన్నారు. వీరిలో 214 మంది భారత్, 119 మంది విదేశీ ప్లేయర్లు. 116 మంది క్యాప్డ్, 215 మంది అన్ క్యాప్డ్ ఉన్నారు.

స్టార్ క్రికెటర్లు ఎవరు?

హ్యారీ బ్రూక్, ట్రవిస్ హెడ్, మిఛెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, కరుణ్ నాయర్, మనీష్ పాండే, రౌమన్ పావెల్, స్టీవ్ స్మిత్, పాట్ కమ్మిన్స్, వనిందు హసరంగ, రచిన్ రవీంద్ర, కేఎస్ భరత్, కుషాల్ మెండిస్, ట్రిస్టన్ స్టబ్స్, లోకీ ఫెర్గూసన్, అల్జారీ జోసెఫ్, దిల్షాన్ మదుశంక.. వంటి స్టార్ ప్లేయర్లందరూ తమ అదృష్ణాన్ని పరీక్షించుకోనున్నారు.

ఎన్ని స్లాట్లు ఉన్నాయి?

10 ఫ్రాంఛైజీలకు కలిపి మొత్తం 77 స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 30 స్లాట్లు విదేశీ ప్లేయర్ల కోసం కేటాయించారు. ఫ్రాంఛైజీల యాజమానులు ఈ 77 మందిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

ఏ ఫ్రాంఛైజీ వద్ద ఎంత డబ్బు మిగులు?

గుజరాత్ టైటాన్స్- రూ. 38.15 కోట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్- రూ. 34 కోట్లు, కోల్‌కతా నైట్ రైడర్స్- రూ. 32.7 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్- రూ. 31.4 కోట్లు, పంజాబ్ కింగ్స్ - రూ. 29.1 కోట్లు, ఢిల్లీ కేపిటల్స్- రూ. 28.95 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- రూ. 23.25 కోట్లు, ముంబై ఇండియన్స్ - రూ. 17.75 కోట్లు, రాజస్థాన్ రాయల్స్- రూ. 14.5 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్- రూ. 13.15 కోట్ల మొత్తం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+