IPL Auction 2026: జాక్ పాట్ కొట్టేసిన 'బేబీ మలింగ'

IPL Auction 2026: అబుదాబీలోని ఎతిహాద్ అరేనాలో జరుగుతున్న ఐపీఎల్ 2026 మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ సంచలనం సృష్టించింది. శ్రీలంక స్టార్ బౌలర్, 'బేబీ మలింగ'గా పిలవబడే మతీషా పతిరానాను ఏకంగా రూ. 18 కోట్లకు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. రూ. 2 కోట్ల బేస్ ధరతో వేలంలోకి వచ్చిన పతిరానా కోసం జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రత్యేకించి డెత్ ఓవర్లలో అత్యంత ప్రభావవంతంగా బౌలింగ్ చేయగల పతిరానా సామర్థ్యంపై కేకేఆర్ నమ్మకం ఉంచింది.

వేలం సాగిందిలా..
మతిషా పతిరానా పేరు రాగానే ఢిల్లీ క్యాపిటల్స్ (DC), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య బిడ్డింగ్ వార్ మొదలైంది. ధర వేగంగా రూ. 10 కోట్లు, ఆపై రూ. 15 కోట్లు దాటిపోయింది. ఢిల్లీ రూ. 15.80 కోట్ల వద్ద రేసు నుంచి తప్పుకుంది. చివర్లో రంగంలోకి దిగిన కేకేఆర్.. లక్నోతో తలపడి రూ. 18 కోట్లకు పతిరానాను దక్కించుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన శ్రీలంక ఆటగాడిగా పతిరానా రికార్డు సృష్టించాడు.

IPL Auction 2026 KKR Hits the Jackpot by Buying Matheesha Pathirana for Rs 18 Crore

సీఎస్కే నుంచి కేకేఆర్‌కు..
పతిరానా తన ఐపీఎల్ ప్రయాణాన్ని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తో ప్రారంభించాడు. ధోనీ సారథ్యంలో రాటుదేలిన పతిరానా.. 32 మ్యాచ్‌ల్లో 47 వికెట్లు పడగొట్టాడు. అయితే 2025 సీజన్ తర్వాత సీఎస్కే అతన్ని విడుదల చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు కేకేఆర్ అతన్ని జట్టులోకి తీసుకోవడం ద్వారా తమ బౌలింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేసుకుంది.

కేకేఆర్ మాస్టర్ ప్లాన్
నేటి వేలంలో కేకేఆర్ దూకుడు ప్రదర్శిస్తోంది. కామెరాన్ గ్రీన్‌ను రూ.25.20 కోట్లతో రికార్డు స్థాయి ధర (ఓవర్సీస్ ప్లేయర్లలో టాప్) పలికాడు.డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అయిన మతీషా పతిరానాను రూ. 18 కోట్లతో కొనుగోలు చేసింది. రూ. 2 కోట్లతో విధ్వంసక ఓపెనర్ అయిన ఫిన్ అలెన్‌ను కూడా దక్కించుకుంది.

రాబిన్ ఉతప్ప విశ్లేషణ
మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప మాట్లాడుతూ, "కేకేఆర్‌కు మంచి డెత్ బౌలర్ అవసరం ఉంది. పతిరానా వంటి బౌలర్ ఆ జట్టు కోచింగ్ స్టాఫ్ పర్యవేక్షణలో మరింత ప్రమాదకరంగా మారుతాడు" అని అభిప్రాయపడ్డారు. కోల్‌కతా నైట్ రైడర్స్ తమ వద్ద ఉన్న భారీ పర్సును సరిగ్గా ఉపయోగిస్తూ స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేస్తోంది. హర్షిత్ రాణా, వైభవ్ అరోరా వంటి స్వదేశీ పేసర్లకు తోడుగా పతిరానా చేరికతో కేకేఆర్ బౌలింగ్ లైనప్ అజేయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+