ఐర్లాండ్ చేతిలో దక్షిణాఫ్రికాకు చావుదెబ్బలు
IRE vs SA 2nd T20I: టీ20 ఇంటర్నేషనల్స్‌లో ఐర్లాండ్ చరిత్ర సృష్టించింది. టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనలిస్ట్ దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. టీ20 స్పెషలిస్టులతో నిండివున్న టీమ్‌ను 10 పరుగుల తేడాతో పరాజయాన్ని రుచి చూపించగలిగింది. ఈ విజయంతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది ఐర్లాండ్.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఐర్లాండ్- దక్షిణాఫ్రికా మధ్య రెండు టీ20లు, మూడు వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్ కొనసాగుతోంది. తొలి టీ20లో జయకేతనం ఎగురవేసింది దక్షిణాఫ్రికా. అబుధాబి స్టేడియం ఈ సిరీస్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఈ నెల 27వ తేదీన ఎనిమిది వికెట్ల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది. రెండో టీ20లో ఐర్లాండ్ దెబ్బకు చుక్కలు కనిపించాయి ప్రొటీస్ టీమ్‌కు.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 195 పరుగులు సాధించింది. ఈ టార్గెట్‌ను దక్షిణాఫ్రికా ఛేదించలేకపోయింది. చేతులెత్తేసింది. 20 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగలిగిందంతే.
ఐర్లాండ్ ఇంత భారీ స్కోర్ సాధించడానికి కారణం ఓపెనర్లే. రాస్ అడేర్ సెంచరీ బాదాడు. 58 బంతుల్లో తొమ్మిది బారీ సిక్సర్లు, అయిదు ఫోర్లతో సరిగ్గా 100 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ కేప్టెన్పీ ఇన్నింగ్ ఆడాడు. 31 బంతు్లో 52 పరుగులు చేశాడు.
హ్యారీ టెక్టార్- 0, జార్జ్ డాక్రెల్- 20, కర్టీస్ క్యాంఫర్- 0, వికెట్ కీపర్ నీల్ రాక్- 1, మార్క్ అడైర్- 3, ఫియాన్ హ్యాండ్- 4 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా కూడా ప్రారంభ ఓవర్లల్లో మాత్రమే పోరాడింది. ఇక్కడ కూడా రాణించింది ఓపెనర్లు, వన్ డౌన్ బ్యాటర్ మాత్రమే.

ఓపెనర్ రీజా హెండ్రిక్స్- 51, మాథ్యూ బ్రీజ్‌కె- 51 పరుగులు చేశారు. మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్- 36 పరుగులతో రాణించాడు. మిగిలిన బ్యాటర్లెవరూ కూడా కనీసం డబుల్ డిజిట్ కూడా అందుకోలేకపోయారు. ఎయిడెన్ మార్క్‌రమ్- 8, ట్రిస్టన్ స్టబ్స్- 9, వియాన్ ముల్డర్- 8, ప్యాట్రిక్ క్రూగర్- 5, నకాబాయోమ్జీ పీటర్- 4, జోర్న్ ఫోర్ట్యున్- 0, లిజార్డ్ విలియమ్స్- 0, లుంగి ఎన్గిడి- 3 పరుగులు చేశారు.
ఐర్లాండ్ బౌలర్ మార్క్ అడైర్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 31 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. మరో బౌలర్ గ్రాహం హ్యూమ్ మూడు వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన రాస్ అడైర్, నాలుగు వికెట్ల నేల కూల్చిన మార్క్ అడైర్.. అన్నదమ్ములు. వారిద్దరే మ్యాచ్‌ను గెలిపించినట్టయింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications