వాడా..కుక్క మాంసం తినేటోడు- అందుకే మొరుగుతా ఉంటాడు: స్టార్ క్రికెటర్ పై షాకింగ్ కామెంట్స్

పాకిస్తాన్ మాజీ లెజెండరీ క్రికెటర్, ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదీ.. తాజాగా వివాదాలకు కేంద్రబిందువు అయ్యాడు. భారత మాజీలు, లెజెండరీ ప్లేయర్ల నుంచి విమర్శలు, సెటైర్లు, ట్రోల్స్ ను ఎదుర్కొంటోన్నాడు. అతన్ని ట్రోల్ చేస్తోన్న వారి జాబితాలో తాజాగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా చేరాడు.

2006లో జరిగిన ఓ ఆసక్తికరమైన సంఘటనను గుర్తు చేసుకుంటూ సెటైర్లు వేశాడు ఇర్ఫాన్. ఓ మ్యాచ్ కోసం రెండు జట్లూ విమానంలో ప్రయాణిస్తోన్నప్పుడు షాహిద్ అఫ్రిది తన జుట్టును చెరిపి వేశాడని, దీనితో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుందని పఠాన్ తెలిపాడు.

Irfan Pathan vs Shahid Afridi The Barking Controversy Unveiled

లల్లన్ టాప్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇర్పాన్ పఠాన్ మాట్లాడాడు. 2006లో భారత జట్టు పాకిస్తాన్ పర్యటనలో ఉన్నప్పుడు సంభవించిన ఘటన ఇది. కరాచీ నుంచి లాహోర్‌కు ఇరు దేశాల ఆటగాళ్లు ఒకే విమానంలో ప్రయాణించారని పఠాన్ వెల్లడించాడు. ఈ ప్రయాణంలోనే అఫ్రిది తన జుట్టును చెరిపివేశాడని, ఎలా ఉన్నావు? అంటూ సెటైర్లు వేశాడని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగిందని, అప్పటి ఉదంతం తనకు ఇప్పటికీ బాగా గుర్తు ఉందని పేర్కొన్నాడు.

కరాచీ నుండి లాహోర్‌కు విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో అఫ్రిది వచ్చి నా తలమీద చెయ్యి వేసి, జుట్టును చెరిపేశాడు. అతను నన్ను ఎలా ఉన్నావు?' అని అడిగాడు. దానికి నేను 'నువ్వు నా తండ్రి ఎప్పటి నుండి అయ్యావు?' అని అడిగాను.. అని ఎదురు ప్రశ్న వేశానని అన్నాడు.

షాహిద్ అఫ్రిదివి పిల్ల చేష్టలని ఎద్దేవా చేశాడు ఇర్పాన్ పఠాన్. అతనితో తనకు స్నేహం లేదని, అతనేమీ తనకు బెస్ట్ ఫ్రెండ్ ఏమీ కాదని పేర్కొన్నాడు. ఆ ఘటన తర్వాత- అఫ్రిది తనను దుర్భాషలాడగా.. అతనితో విమానంలోనే అతనితో గొడవ పెట్టుకున్నానని చెప్పాడు. ఈ గొడవ తర్వాత అబ్దుల్ రజాక్‌తో మాట్లాడానని, పాకిస్తాన్‌లో లభించే నాన్ వెజ్ గురించి అడిగానని అన్నారు.

విమానంలో తన పక్కన ఖాళీగా ఉన్న సీట్ లో అబ్దుల్ రజాక్ వచ్చి కూర్చున్నాడని, పాకిస్తాన్ ఎలాంటి నాన్ వెజ్ దొరుకుతుందని అడగ్గా.. వివిధ వెరైటీల గురించి వివరించాడని చెప్పాడు. కుక్క మాంసం దొరుకుతుందా అని అడగ్గా.. రజాక్ ఆశ్చర్యపోయాడని, ఎందుకు అలా అడుగుతున్నావని ప్రశ్నించాడు. అఫ్రిది కుక్క మాంసం తిని ఉండవచ్చని, అందుకే మొరుగుతున్నాడని బదులిచ్చానని పఠాన్ వెల్లడించాడు.

ఇది విన్నప్పటికీ అఫ్రిది ఏమీ రిప్లై ఇవ్వలేకపోయాడని పఠాన్ గుర్తు చేసుకున్నాడు. అతను ఏదైనా బదులు చెప్పివుంటే తాను మళ్ళీ మొరుగుతున్నాడని అనేవాడినని స్పష్టం చేశాడు. ఈ ఘటన తర్వాత అఫ్రిది.. లాహోర్ లో ఫ్లైట్ దిగేంత వరకూ సైలెంట్ గానే ఉన్నాడని గుర్తు చెప్పుకొచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+