ఆర్సీబీకి అలా అన్నీ కలిసొస్తున్నాయ్ గానీ..!!

IPL 2025 final: ఐపీఎల్ 2025లో బిగ్ డే.. నేడే ఫైనల్స్. ఐపీఎల్ లో ఓ కొత్త ఛాంపియన్ ఆవిర్భవించబోయేదీ నేడే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఢీ కొట్టబోతోంది పంజాబ్ కింగ్స్. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలుకానుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం దీనికి వేదిక.

ఏ జట్టు గెలిచినా.. తొలిసారి కప్ ను ముద్దాడుతుంది. ఈ రెండింట్లో ఏ జట్టు కూడా ఇప్పటివరకు ఐపీఎల్ కప్ కొట్టలేదు. 2022 తరువాత మళ్లీ అలాంటి సీన్.. ఈ రాత్రికి రిపీట్ కాబోతోంది. ఆ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ ఛాంపియన్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఓ కొత్త విజేతను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేయబోతోంది 18వ ఐపీఎల్ సీజన్.

Is Virat Kohli s jersy number connected with IPL 2025 lucky for RCB

ఇప్పటివరకు అత్యధికసార్లు ఐపీఎల్ ఛాంపియన్లుగా నిలిచిన జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే. అయిదేసిసార్లు చొప్పున కప్ గెలిచాయి. ఈ రెండింటికే మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్స్ అనే పేరు ఉంది. ఈ సారి ఈ రెండూ కూడా ఫైనల్స్ చేరలేకపోయాయి. చెన్నై సూపర్ కింగ్స్.. లీగ్స్ దశలోనే ఇంటిముఖం పట్టగా.. ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ లో ఓడిపోయింది.

ఈ రెండింటి తరువాత కోల్ కత నైట్ రైడర్స్ మూడుసార్లు విజేతగా నిలిచింది. రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, దక్కన్ ఛార్జర్స్ ఒక్కోసారి కప్ అందుకున్నాయి. నేడు- రాయల్ ఛాలెంజర్స్ లేదా పంజాబ్ కింగ్స్.. ఈ జాబితాలో చేరనున్నాయి.

ఇది- 18వ ఐపీఎల్ ఎడిషన్. అలాగే.. ఆర్సీబీ జట్టు బ్యాటింగ్ మెషీన్ విరాట్ కోహ్లీ ధరించే జెర్సీ నంబర్ కూడా 18 కావడం అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. ఇది జట్టుకు అదృష్టంగా మారుతుందని అభిమానులు ఆశిస్తోన్నారు. ఇన్నేళ్ల కల నెరవేరుతుందనడానికి ఇదొక శుభ సూచనగా భావిస్తోన్నారు.

అదొక్కటే కాదు.. నేటి తేదీ కూడా ఆర్సీబీకి కలిసొచ్చేదే. 3/6/2025 కూడితే వచ్చేది 18దే. ఇవన్నీ అంచనాలు వేసుకుని మరీ ఆర్సీబీపై ఆశలు పెట్టుకున్నారు. పైగా క్వాలిఫయర్ 1లో పంజాబ్ కింగ్స్ మట్టి కరిపించడం దీనికి బోనస్ గా భావిస్తోన్నారు. క్వాలిఫయర్ 1 తరహాలోనే ఆర్సీబీ ఇప్పుడూ రెచ్చిపోతే కల సాకారమౌతుందని ఆశిస్తోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+