ఇషాన్..ఎషాన్.. జీషాన్: షాన్ దార్ హైదరాబాద్
SRH vs LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తదుపరి మ్యాచ్ ఆడతోంది. లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడుతోంది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి ఏకనా స్టేడియం దీనికి వేదిక. ఇప్పటికే ఐపీఎల్ ప్లేఆఫ్స్ నుంచి వైదొలగినందున సన్ రైజర్స్ కు ఈ మ్యాచ్ పెద్దగా ఉపయోగపడకపోవచ్చు గానీ.. పరువు నిలుపుకోవాలనే పట్టుదలతో ఉంది.
టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. జట్టు కథ పెద్దగా మారనట్టే కనిపిస్తోంది. ప్రారంభ ఓవర్లల్లో లక్నో సూపర్ జెయింట్స్ దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్లు మిఛెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్ రమ్.. సన్ రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. భారీ షాట్లు ఆడుతున్నారు.

ప్రత్యేకించి- మిఛెల్ మార్ష్. మెరుపు ఇన్నింగ్ ఆడుతున్నాడీ ఓపెనర్. 24 బంతుల్లో నాలుగు భారీ సిక్సర్లు, రెండు బుల్లెట్ల వంటి ఫోర్లతో 43 పరుగులతో ఆడుతున్నాడు. అతనికేమీ తీసిపోవట్లేదు మార్క్ రమ్. 17 బంతుల్లో రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 36 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.
సన్ రైజర్స్ బౌలర్లు పాట్ కమ్మిన్స్, హర్ష్ దుబే, హర్షల్ పటేల్, ఎషాన్ మలింగ, జిషాన్ అన్సారీ.. పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నారు. అందరు బౌలర్లు కూడా 10కి పైగా ఎకానమీని నమోదు చేసుకున్నారు. ప్రత్యేకించి- హర్ష్ దుబేపై ప్రతాపం చూపారు బ్యాటర్లు.
సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ లో ముగ్గురు షాన్లు ఆడుతోడటం అందరి దృష్టినీ ఆకర్షించింది. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్, ఆల్ రౌండర్ శ్రీలంకకు చెందిన ఎషాన్ మలింగ, ఉత్తర ప్రదేశ్ కు చెందిన లెగ్ బ్రేక్ గుగ్లీ బౌలర్ జిషాన్ ఆన్సారీ జట్టులో ఉన్నారు. షాన్దార్ హైదరాబాద్ అనిపించారు.
డాషింగ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ జట్టుకు దూరం అయ్యాడు. ప్రమాదకర కోవిడ్ 19 వైరస్ బారిన పడ్డాడు. ఈ విషయాన్ని హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరీ వెల్లడించాడు. ప్రస్తుతం హోటల్ కే పరిమితం అయ్యాడు. హెడ్ అందుబాటులో లేకపోవడం వల్ల అభిషేక్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ ఇన్నింగ్ ను ఆరంభించనున్నాడు.












Click it and Unblock the Notifications