ప్రతాపం చూపించిన కావ్యా పాప ఫేవరెట్ ప్లేయర్.. !!
న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో భారత్.. అద్భుత విజయాన్ని అందుకుంది. 208 పరుగుల భారీ స్కోర్ ను అలవోకగా అందుకుంది. 15.2 ఓవర్లలోనే ఊదిపడేసింది. ఈ గెలుపుతో అయిదు మ్యాచ్ ల ఈ సిరీస్ లో 2-0 తేడాతో ముందంజలో నిలిచింది టీమిండియా. తొలి మ్యాచ్ లోనూ సునామీ ఇన్నింగ్ ఆడిందీ జట్టు. అదే దూకుడును ఇక్కడా కొనసాగించింది. బౌలర్ల తుక్కు రేగ్గొట్టింది. చిత్తుగా ఓడించింది.
రచిన్, శాంట్నర్ దూకుడు..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. కెప్టెన్ మిచెల్ శాంట్నర్ (27 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 47 నాటౌట్), రచిన్ రవీంద్ర (26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో కుల్ దీప్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే తలో వికెట్ పడగొట్టారు.

అలవోకగా అందుకున్న భారత్..
అనంతరం భారత్ 15.2 ఓవర్లలో 3 వికెట్లకు 209 పరుగులు చేసింది. ఫాస్టెస్ట్ ఛేజింగ్ గి రికార్డు నెలకొల్పింది. ఇంకా 28 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని కైవసం చేసుకుంది. ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ విఫలమైనా ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ చెలరేగారు. తడాఖా చూపారు. చివర్లో శివమ్ దూబే (18 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 35 నాటౌట్) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగాడు. దీంతో అలవోకగా విజయాన్ని అందుకుంది టీమిండియా. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, జాకబ్ డఫీ, ఈష్ సోధీ తలో వికెట్ తీశారు.
ఏం తిన్నాడో గానీ..
ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్ లో ప్రతాపాన్ని చూపాడు. అతని బ్యాటింగ్ స్కిల్స్, షాట్ల ఎంపికను సూర్యకుమార్ యాదవ్ ప్రశంసించకుండా ఉండలేకపోయాడు. ఇదివరకెప్పుడూ ఇటువంటి ఇన్నింగ్ చూడలేదని అన్నాడు. మధ్యాహ్నం భోజనంలో ఏం తిన్నాడో తెలియదు గానీ తనకు బ్యాటింగ్ చేసే అవకాశమే ఇవ్వలేదని, నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉంటూ అతని విధ్వంసాన్ని కళ్లారా చూశానని, బాగా ఎంజాయ్ చేశానని తెలిపాడు.
లైన్ లోకి వచ్చా..
ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చి పవర్ ప్లేలో జట్టు స్కోర్ 60 పరుగులు దాటించడమే అతని బ్యాటింగ్ విధ్వంసానికి నిదర్శనమని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడాలనేదే తాను ఎప్పటి నుంచో కోరికుంటోన్నానని, అది ఈ మ్యాచ్‌లో కనిపించిందని వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్‌కు ముందు కూడా మంచి ప్రాక్టీస్ సెషన్ లభించిందని, తాను బ్యాటింగ్ రిథమ్ అందిపుచ్చుకున్నానని అన్నాడు.












Click it and Unblock the Notifications