అభిషేక్ శర్మ ఓపెనింగ్ పార్టనర్ ఫిక్స్- తుఫాన్ బ్యాటర్ ఎంట్రీ..!!

T20 World Cup: టీ20 ప్రపంచ కప్ వేళ టీమిండియా పై అంచనాలు పెరుగుతున్నాయి. దీనికి ముందుగా న్యూజీలాండ్ తో ఈ రోజు నుంచి ప్రారంభం అవుతున్న అయిదు టీ20 మ్యాచ్ లు టీం కు కీలకంగా మారుతోంది. వరుసగా గాయాలతో టీమిండియా ప్లేయర్లు సతమతం అవుతున్నారు. కాగా, టీ20 ప్రపంచ కప్ కు మాత్రం ఓపెనింగ్ బ్యాటింగ్ కోసం తుఫాను జోడీని సెలెక్ట్ చేసారు. తొలి బంతి నుంచే వీర విహారం చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అభిషేక్ శర్మతో పాటుగా బ్యాటింగ్ లో సరైన ప్లేయర్ ను ఓపెనింగ్ జోడీగా ఫిక్స్ చేసారు.

టీ20 ప్రపంచ కప్ లక్ష్యంగా ఇప్పుడు టీం ఇండియా కూర్పు కొనసాగుతోంది. ప్రస్తుతం కివీస్ తో జరుగుతున్న సిరీస్ లో పూర్తి స్థాయిలో ప్రయోగాలు చేస్తున్నారు. వన్డే సిరీస్ ఓడిపోయినా ప్లేయర్ల సామర్ధ్యం పరీక్షిస్తున్నారు. కివీస్ తో జరిగే అయిదు టీ20 మ్యాచ్ లు సైతం ఇప్పుడు కీలకంగా మారుతున్నాయి. ప్రపంచ కప్ పైన ఈ సారి ఫ్యాన్స్ లో భారీ అంచనాలు కనిపిస్తున్నాయి. మరో సారి టీమిండియా విజేతగా వస్తుందని ఆశిస్తున్నారు.

Ishan Kishan likely the opener in the T20 World Cup with Abhishek sharma

దీంతో.. టీం ఓపెనింగ్ జోడి ఖరారు చేస్తూ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అభిషేక్ ఓపెనర్ గా రావటం ఖాయం కావటంతో.. ఇక సరైన జోడీని ఎంపిక చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా వికెట్ కీపింగ్ తో పాటుగా పవర్ ప్లే లో బలమైన షాట్స్ ఆడగలిగే ఇషాన్ కిషన్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

అభిషేక్ - ఇషాన్ ఇద్దరూ సన్ రైజర్స్ లో తమ సత్తా ఏంటో చాటారు. ఇద్దరిదీ అటాకింగ్ స్టైల్ కావటంతో.. టీ20 ఫార్మాట్ లో ఓపెనింగ్ కు ఇదే సరైన జోడిగా నిర్ణయించారు. అదే సమయంలో కిషన్వికెట్ కీపింగ్ నైపుణ్యాలు జట్టుకు అదనపు బలంగా భావిస్తున్నారు. ఇక.. ఫిబ్రవరి 7న టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ సమయంలోనే దాదాపు రెండు సంవత్సరాల విరామం తర్వాత ఇషాన్ కిషన్ భారత టీ20 జట్టులోకి తిరిగి వచ్చాడు.

ఇషాన్ కిషన్ చివరిసారిగా నవంబర్ 28, 2023న ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆడాడు. ఆ తర్వాత జట్టు లో ఛాన్స్ దక్కలేదు. ఇక, దేశవాలీ క్రికెట్ లో మరోసారి తన సత్తా చాటటం ద్వారా ఇప్పుడు బీసీసీఐ ఇషాన్ కిషన్ కు న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అవకాశం ఇవ్వటంతో పాటుగా టీ20 ప్రపంచ కప్ జట్టులోనూ చోటు దక్కించుకుంది. దీంతో.. అభిషేక్ - ఇషాన్ కిషన్ ఓపెనర్లుగా బ్యాటింగ్ కు దిగితే.. ఫ్యాన్స్ కు పవర్ ప్లేలో ఇక పైసా వసూల్ ఖాయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+