వెన్ను విరిగిన ఆస్ట్రేలియా: టీ20 వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ అవుట్

టీ20 వరల్డ్ కప్ ఎంతో దూరం లేదు. ఇంకొక్క రోజే. ఈ నెల 7వ తేదీన ప్రారంభం కాబోతోందీ టోర్నమెంట్. ప్రస్తుతం వామప్స్ నడుస్తున్నాయి. ఈ టోర్నమెంట్‌కు ఒక్కరోజు ముందు ఆస్ట్రేలియాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా టోర్నమెంట్ నుండి తప్పుకొన్నాడు. 2011 మార్చి తర్వాత ఆస్ట్రేలియా తమ బిగ్ 3 ఫాస్ట్ బౌలర్లు లేకుండా ప్రపంచ కప్ ఆడుతుండటం ఇదే మొదటిసారి.

నవంబర్ 12న షెఫీల్డ్ షీల్డ్‌లో హామ్‌స్ట్రింగ్ గాయానికి గురయ్యాడు హేజిల్‌వుడ్. అప్పటి నుండి ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. వరల్డ్ కప్ లో ఆడతాడని భావించినప్పటికీ పరిస్థితి దీనికి భిన్నంగా మారింది. జట్టు మొత్తం శ్రీలంకకు చేరుకున్నప్పుడు కూడా అతను సిడ్నీలోనే ఉండిపోయాడు. వరల్డ్ కప్ ఆడే జట్టులో స్థానం దక్కించుకున్నప్పటికీ.. ఇప్పుడు గాయం కారణంగా వైదొలగాల్సి వచ్చింది. టీ20 వరల్డ్ కప్ లో ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది ఆస్ట్రేలియాకు.

Josh Hazlewood Ruled Out Of 2026 T20 World Cup For Australia as its Bowling Woe Deepens with best 3

అప్పటి వరకు హేజిల్ వుడ్ కోలుకుంటాడని తొలుత భావించారు. ఇదే విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ టోనీ డోడెమైడ్ కూడా ప్రకటించారు. కోలుకున్న తర్వాత అతను శ్రీలంకకు బయలుదేరి వెళ్తాడని, జట్టుతో కలుస్తాడని అన్నారు. ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయింది. సూపర్ 8 దశ నాటికైనా ఫిట్‌నెస్ సాధిస్తాడని ఆశించింది ఆస్ట్రేలియా. అవేవీ సాధ్యపడట్లేదు. హేజిల్ వుడ్ కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని డోడెమైడ్ తాజాగా పేర్కొన్నారు. అతని రికవరీని వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తే అది మరింత ప్రమాదానికి దారి తీస్తుందని ఆయన తేల్చి చెప్పారు.

ఇప్పటికే సీనియర్ క్రికెటర్లు గాయం కారణంగా దూరం అయ్యారు. గాయపడిన ఆటగాళ్ల జాబితాలో హాజిల్‌వుడ్‌తో పాటు ఆల్ ఫార్మాట్ స్టార్ పాట్ కమ్మిన్స్ కూడా ఉన్నాడు. దీంతో మిచెల్ మార్ష్ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు పేస్ బౌలింగ్ విభాగంలో బలహీనపడింది. ప్రస్తుతం రైట్‌ ఆర్మ్ స్వింగ్ బౌలర్ జేవియర్ బార్ట్‌లెట్, సిడ్నీ సిక్సర్స్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ బెన్ డ్వార్షుష్ మాత్రమే పూర్తిగా ఫిట్‌గా ఉన్న ప్రధాన పేసర్లు.

సీన్ అబాట్ ట్రావెలింగ్ రిజర్వ్ ఆటగాడిగా ఉన్నాడు. హాజిల్‌వుడ్ స్థానంలో అతను జట్టులో చేరే అవకాశం ఉంది. హరికేన్స్ కెప్టెన్ నాథన్ ఎల్లిస్ కండరాల గాయం నుండి కోలుకుని ఫిట్‌నెస్ సాధిస్తోన్నప్పటికీ.. ఈ నెల 11న జరిగే ఆస్ట్రేలియా తొలి మ్యాచ్ నాటికి అతను అందుబాటులో ఉంటాడా అనేది డౌటే. ఎల్లిస్‌తో పాటు స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్ కూడా లీగ్ మ్యాచ్ లకు అందుబాటులో ఉంటారని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. స్పిన్నర్ ఆడమ్ జంపా ఐర్లాండ్ మ్యాచ్‌కు ఫిట్‌గా ఉన్నాడు.

టీ20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియా జట్టులో- మిచ్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కానలీ, టిమ్ డేవిడ్, బెన్ ద్వార్షుష్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కున్‌మన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ రెన్‌షా, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా ఉన్నారు. ట్రావెలింగ్ రిజర్వ్ గా సీన్ అబాట్ చోటు దక్కించుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+