Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Kavya Maran: సన్ రైజర్స్ డ్రెస్సింగ్ రూమ్ లో కావ్యా మారన్-క్రికెటర్లకు ఓదార్పు ఇలా..!

నిన్న కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన ఐపీఎల్ 2024 ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు దారుణంగా ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసి 113 పరుగులకే కుప్పకూలిన సన్ రైజర్స్.. 8 వికెట్ల తేడాతో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడింది. దీంతో సన్ రైజర్స్ అభిమానులు షాకయ్యారు. ఎప్పుడూ గ్యాలరీలో కూర్చుని తన హావభావాలతో అభిమానుల్ని ఆకట్టుకునే జట్టు సహ యజమాని కావ్యా మారన్ కూడా కంటతడి పెట్టేశారు. దీంతో సన్ రైజర్స్ ను ఈ స్థాయికి చేర్చిన ఆమే అసలు విజేత అంటూ సోషల్ మీడియాలో అభిమానులు ఓదారుస్తున్నారు.

అయితే కోల్ కతా చేతిలో సన్ రైజర్స్ ఓటమి తర్వాత కంటతడి పెట్టిన కావ్యామారన్.. అక్కడితో ఆగిపోలేదు. వెంటనే సన్ రైజర్స్ డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లారు. ఫైనల్లో ఓటమిపై వారిని ఓదార్చారు. ఆటలో ఇవన్నీ సహజమేనని, మిమ్మల్ని గర్వపడేలా చేశారంటూ వారిని ఆకాశానికెత్తేశారు. ఈ వీడియోను ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ ఎక్స్ లో షేర్ చేసింది. ఇందులో క్రికెటర్లను కావ్యా మారన్ ఓదారుస్తున్న తీరు అభిమానుల్ని కదిలించేలా ఉంది.

kavya maran consolation to SRH players in dressing room over Ipl 2024 final debacle

డ్రెస్సింగ్ రూమ్ లోకి రాగానే క్రికెటర్లను పలకరించిన కావ్యా మారన్... మీరు మిమ్మల్ని ఎంతో గర్వపడేలా చేశారంటూ ప్రశంసించారు. అది చెప్పడానికే ఇక్కడికి వచ్చానన్నారు. మీ ఆటతీరుతో టీ20 క్రికెట్ కు కొత్త నిర్వచనం చెప్పారని కొనియాడారు. అంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారని గుర్తుచేశారు. ఇవాళ మాత్రం ఇలా జరిగిందని బాధపడ్డారు.కానీ అందరూ బంతితో బ్యాట్ తో మంచి ప్రదర్శన ఇచ్చారని.. థ్యాంక్యూ సోమచ్ అంటూ అభినందించారు.

గతేడాది మనం చివరి స్ధానంలో నిలిచినా ఫ్యాన్స్ ఈసారి మిమ్మల్ని చూసి భారీ సంఖ్యలో గ్రౌండ్స్ కు వచ్చారని క్రికెటర్లతో కావ్యా మారన్ తెలిపారు. దీనిపైనే అంతా చర్చించుకుంటున్నారన్నారు. కోల్ కతా గెలిచినా మనం క్రికెట్ ఆడిన స్టైల్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారన్నారు. ఇలా బాధపడుతూ కనిపించకండి అంటూ ఓదార్చారు. మనం ఫైనల్స్ ఆడాం, ఇది మిగతా ఆటల్లా కాదన్నారు. ఇవాళ రాత్రి అన్ని టీమ్ లు మనల్ని చూసి ఉంటాయన్నారు. చివరిగా మరోసారి ధన్యవాదాలు తెలిపి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+