కావ్య పాప ఇచ్చే కిక్కే వేరబ్బా..!

కావ్య మారన్ .. ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండరు. ఎందుకంటే క్రికెట్‌ను ఫాలో అయ్యేవారికి కావ్య మారన్ సుపరిచితురాలే. ముఖ్యంగా ఐపీఎల్‌ను ఇష్టపడేవారికి కావ్య మారన్ తెలియకుండా ఉండరు.సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ప్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ అనే సంగతి అందరికి తెలిసిన విషయమే.. ఐపీఎల్‌తో కావ్యా మారన్ బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అభిమానులు ఆమెను ముద్దుగా కావ్య పాప అని పిలుచుకుంటారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మ్యాచ్‌లు జరిగిన ప్రతిసారి స్టాండ్స్‌లో కూర్చొని జట్టును ఎంకరేజ్ చేస్తుంటారామె.

కావ్య మారన్ ఇచ్చే భావోద్వేగాలు కూడా క్రికెట్ అభిమానులను ఇట్టే ఆకట్టుకుంటాయి. హైదరాబాద్‌ టీం గెలిచినా, ఓడినా కావ్య పాప ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ అన్ని ఇన్ని కావు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టీంను ఇష్టపడే వారు ఉన్నారో లేదో కాని.. కావ్య మారన్‌ని ఇష్టపడని వారుండరు. కావ్య మారన్ కోసమే సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మ్యాచ్‌లు చూసే వారి కూడా ఉన్నారంటే ఆమె ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక తాజాగా జరుగుతున్న ఐపీఎల్ వేలంలోనూ కావ్య మారన్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.

Kavya Maran is a special attraction in IPL-2025

బౌలర్ అర్షదీప్ సింగ్ కోసం కావ్య మారన్ చివరి నిమిషం వరకు ప్రయత్నించారు. అర్షదీప్ సింగ్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి.ఈక్రమంలోనే 15. 75 కోట్లకు హైదరాబాద్ వేలంలో దక్కించుకోగా.. పంజాబ్ జట్టు అతన్ని రూ. 18 కోట్లకు రైట్ టు మ్యాచ్ పద్ధతి ద్వారా తిరిగి అర్షదీప్ సింగ్‌ను సొంతం చేసుకొంది. దీంతో కావ్య మారన్‌కు నిరాశే ఎదురైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+