ఐపీఎల్ పై చేతబడి గానీ చేశావేంట్రా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ దగ్గరికొచ్చింది. ఈ నెల 28న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మధ్య జరుగనుంది. ఈ ఐపీఎల్ ఓపెనర్ కు బెంగళూరు ఎం చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ప్రస్తుతం 10 జట్లు తమ సన్నాహకాల్లో నిమగ్నం అయ్యాయి. ప్లేయర్లందరూ తమ జట్లతో కలుస్తున్నారు. ముమ్మరంగా ప్రాక్టీస్ సాగిస్తోన్నారు.
ఈ సీజన్ ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్ గాయాల బెడదతో సతమతమవుతోంది. వేలంలో పటిష్టమైన జట్టును నిర్మించుకున్నప్పటికీ అది కలిసి రావట్లేదు. ఇప్పుడు రెండు కీలక ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ జట్టు నుంచి వెళ్లిపోయాడు. అతని స్థానంలో బ్లెస్సింగ్ ముజారాబానీని ఇప్పటికే కేకేఆర్ తీసుకుంది. ఇది ఇక్కడితో ఆగట్లేదు.

కేకేఆర్ ప్రధాన పేసర్లు హర్షిత్ రాణా, ఆకాష్ దీప్ సైతం ఐపీఎల్ కు దూరం అయ్యారు. టీ20 ప్రపంచకప్ సన్నాహక మ్యాచ్‌లో హర్షిత్ రాణా గాయపడ్డాడు. ఇప్పటికీ కోలుకోవట్లేదు. ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికీ వైదొలగాల్సొచ్చిందతనికి. ఇటీవలి బీసీసీఐ నామన్ అవార్డుల కార్యక్రమంలో ఊతకర్రలతో కనిపించాడు. ఐపీఎల్ ప్రారంభం అయ్యే సమయానికి గానీ, కనీసం ముగింపు మ్యాచ్ లకు గానీ అందుబాటులో ఉండే పరిస్థితి లేదు.
హర్షిత్ స్థానంలో దేశీయ పేసర్ల కోసం కేకేఆర్ చూస్తోంది. అదే ఆకాష్ దీప్ రూపంలో మరో షాక్ తగిలింది. లోయర్ బ్యాక్ స్ట్రెస్ కారణంగా అతను ఐపీఎల్ సీజన్ నుండి తప్పుకొన్నాడు. అంతకుముందు రంజీ సెమీ ఫైనల్‌లో కాలి మడమ గాయంతో బీసీసీఐ సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ లో లో చికిత్స పొంది కోలుకున్నాడు గానీ. ఇంకా అతనికి విశ్రాంతి అవసరం అయింది. ఆకాష్ దీప్ ను కేకేఆర్ కోటి రూపాయలకు ఒప్పందం చేసుకుంది.
కేకేఆర్ క్యాప్ లో చేరడానికముందే వెన్ను నొప్పి మొదలైంది. మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో ఆకాష్ పూర్తిగా టోర్నమెంట్‌కు దూరం అయ్యాడు. ఈ పరిణామంతో కేకేఆర్ మరో ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసుకోవడం తప్పనిసరి అవుతుంది. హర్షిత్ స్థానంలో సిమర్‌జిత్ సింగ్‌ను పరిశీలిస్తుండగా, ఆకాష్ దీప్‌కు బదులుగా ముంబై ఇండియన్స్ (ఎంఐ) మాజీ పేసర్ ఆకాష్ మధ్వాల్‌పై కేకేఆర్ ఆసక్తి చూపుతోంది.
మధ్వాల్ 2023లో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేశాడు. 17 మ్యాచ్‌లలో 23 వికెట్లు పడగొట్టాడు. 2023 ఎలిమినేటర్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG)కి వ్యతిరేకంగా అతని 5/5 బౌలింగ్ ప్రదర్శన IPL ప్లేఆఫ్ చరిత్రలో అత్యుత్తమ గణాంకాలు. అతని ఎకానమీ 10.06 ఉండటం ఆలోచింపజేస్తోంది. అండర్-19 ప్రపంచకప్ విజేత ఆర్‌ఎస్ అంబరీష్‌పైనా కేకేఆర్ దృష్టి సారించింది. ప్రస్తుతం నైట్ రైడర్స్ శిబిరంలో నెట్ బౌలర్‌గా ఉన్నాడు అంబరీష్. 11 వికెట్లతో ప్రపంచ స్థాయిలో ప్రతిభ చూపాడు. మంచి బ్యాటర్ కూడా. దీంతో పాటు నవదీప్ సైనీ పేరు కూడా కేకేఆర్ పరిశీలనలో ఉంది.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications